- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
IITian Baba: మరోసారి వార్తల్లో నిలిచిన ఐఐటీ బాబా.. ఈసారి ఎందుకంటే?

దిశ, నేషనల్ బ్యూరో: కుంభమేళాతో లైం లైట్ లోకి వచ్చిన ఐఐటీ బాబా మరోసారి వార్తల్లో నిలిచారు. రాత్రికి రాత్రే సెన్సేషన్ గా మారిన ఆయనను జునా అఖారా నుంచి బహిష్కరించారనే ప్రచారం నడుస్తోంది. ఐఐటియన్ బాబా తన గురువు మహంత్ సోమేశ్వర్ పురిని ధూషించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అఖారా నుంచి ఆయన్ను బహిష్కరించారని సమాచారం. అంతేకాదు అఖారా శిబిరం, దాని పరిసరాల్లోకి సైతం రాకుండా సింగ్‌పై నిషేధం విధించారు. "అభయ్ సింగ్ చేసిన పని గురు-శిష్య (గురువు-శిష్యుడు) సంప్రదాయానికి, సన్యాసుల సూత్రాలకు పూర్తిగా విరుద్ధం. ఇది గురువును అగౌరవపరచడం, సనాతన ధర్మం, అఖారా పట్ల గౌరవం లేకపోవడాన్ని చూపుతుంది. జునా అఖారాలో క్రమశిక్షణకు అత్యంత ప్రాముఖ్యత ఉంది" అని జునా అఖారా చీఫ్ ప్యాట్రన్ మహంత్ హరి గిరి అన్నారు. అఖారా సభ్యులు కచ్చితంగా క్రమశిక్షణ పాటించాలని, తోటి వారికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకూడదని మహంత్ హరి గిరి చెప్పారు. “గురువు మాత్రమే కాదు, తోటి వ్యక్తి గురింకి కూడా సైతం వ్యతిరేకంగా మాట్లాడడానికి ఎవరికీ అనుమతి లేదు. ఈ ఉల్లంఘన ఆధారంగానే అఖారా క్రమశిక్షణా కమిటీ అతన్ని బహిష్కరించాలని సిఫార్సు చేసింది” అని తెలిపారు. ఇకపోతే, అభయ్ సింగ్ అదృశ్యంపై అఖారా సభ్యుడు స్పందించారు... వైరల్ అయిన 'బాబా'కు అఖారాతో సంబంధం లేదని అన్నారు. అభయ్ సింగ్ అఖారాను అప్రతిష్టపాలు చేస్తున్నాడని, అతను సాధువు కాదని ఆరోపించారు. ఇకపోతే జునా అఖారాలోని సోలా మణి ఆశ్రమంలో 'బాబా' నివసించేవారని, కానీ ప్రస్తుతం ఆయన ఆచూకీపై ఎలాంటి సమాచారం లేదని సోమేశ్వర్ పూరి తెలిపారు. అయితే, జునా అఖారా సభ్యులు చేసిన వ్యాఖ్యలపై ఐఐటీ బాబా స్పందించారు. “వారు నా గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేశారు. ఆశ్రమ నిర్వాహకులు నన్ను రాత్రిపూట బయలుదేరమని అడిగారు. ఇప్పుడు నేను ప్రసిద్ధి చెందానని.. వారి గురించి ఏదో బయటపెట్టవచ్చని అనుకుంటున్నారు. కాబట్టే, నేను రహస్య ధ్యానం కోసం వెళ్ళానని వారు చెబుతున్నారు. ఆ వ్యక్తులు అర్థంలేని మాటలు మాట్లాడుతున్నారు.” అని చెప్పుకొచ్చారు.
ఐఐటీ బాబా ఎవరంటే?
హర్యానాకు చెందిన అభయ్ సింగ్ ఐఐటీ బాంబేలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. “ఇంజనీరింగ్ చదివిన తర్వాత, నేను ట్రావెల్ ఫోటోగ్రఫీలోకి ప్రవేశించాను. 2019లో కెనడాకు వెళ్లి అక్కడ కెనడియన్ కంపెనీలో నెలకు రూ. 3 లక్షలు అంటే రూ. 36 లక్షల ప్యాకేజీపై పనిచేశాను. ఆ తర్వాత ఉద్యోగం, జీవితంపై నిరాశ చెంది ఆధ్యాత్మికత వైపు వచ్చాన”ని చెప్పాడు. జునా అఖారాకు చెందిన మహంత్ సోమేశ్వర్ పురి శిష్యుడైన అభయ్ సింగ్.. ఐఐటీ-బాంబేలో గ్రాడ్యుయేషన్ తర్వాత ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో తన వృత్తిని వదిలి సాధువుగా మారారు.