- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నాటో సేనలు కవ్విస్తే అణ్వాయుధాలు ప్రయోగిస్తాం : Belarus
మాస్కో : తమ దేశ సరిహద్దుల్లో నాటో (NATO) సైన్యాలు ఓవర్ యాక్షన్ చేస్తే అణ్వాయుధాలను ప్రయోగించడానికీ సిద్ధమేనని బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో ప్రకటించారు. ఉక్రెయిన్ సేనలు సరిహద్దు గీతను దాటి బెలారస్ వైపునకు వస్తే తప్ప.. తమ దేశం యుద్ధానికి దిగదని తేల్చి చెప్పారు. ఒక దేశాన్ని భయపెట్టడానికి తాము ఇక్కడ అణ్వాయుధాలను తీసుకురాలేదని తేల్చి చెప్పారు. తమకు రష్యా అందించిన అణ్వాయుధాలను దేశ రక్షణ కోసం మాత్రమే వాడుకుంటామని ఆయన స్పష్టం చేశారు. తమపై దాడికి తెగబడేవారికి గుణపాఠం చెప్పేందుకే అవి పరిమితమని లుకషెంకో తెలిపారు.
ఉక్రెయిన్‌లో రష్యా ఆక్రమించిన భూభాగాలతో ముడిపడిన అన్ని సమస్యల పరిష్కారానికి ఉక్రెయిన్, రష్యా కలిసికట్టుగా చొరవ చూపాలని కోరారు. వాగ్నర్ గ్రూప్‌కు చెందిన 10వేల మంది కిరాయి సైనికులను బెలారస్ ఇటీవల పోలాండ్ సరిహద్దుల్లో మోహరించిందనే వార్తలు వచ్చాయి. దీనికి కౌంటర్‌గా పోలాండ్ కూడా పెద్దఎత్తున ఆర్మీని బెలారస్ బార్డర్‌కు పంపిందని అంటున్నారు. ఈ తరుణంలోనే అణ్వాయుధాల వినియోగంపై లుకషెంకో వార్నింగ్ ఇచ్చారు.