Loksabha Elections: భారతదేశ రాజకీయాల్లో మరో సంచలనం.. ప్రధాని నరేంద్ర మోడీపై పోటీ చేయనున్న ట్రాన్స్‌జెండర్

by Shiva |   ( Updated:2024-04-09 04:15:37.0  )
Loksabha Elections: భారతదేశ రాజకీయాల్లో మరో సంచలనం.. ప్రధాని నరేంద్ర మోడీపై పోటీ చేయనున్న ట్రాన్స్‌జెండర్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడటంతో ప్రధాన రాజకీయ పార్టీల్లో వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునిగిపోయాయి. రాబోయే ఎన్నికల్లో ఎలాగైన విజయం సాధించాలనే పట్టుదలతో అభ్యర్థుల ఎంపికలోనూ ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలతో పొత్తు కుదుర్చుకుని వీలైనన్ని సీట్లలో పోటీ చేసి ఢిల్లీలో మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తతం అధికారంలో ఉన్న బీజేపీ ‘అబ్ కీ బార్.. 400 పార్’ నినాదంతో ప్రచారంలో దూసుకెళ్తోంది. పదేళ్లుగా అధికారంలో కోల్పోయి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీ వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో కలిపి ఇండియా కూటమితో ప్రజల ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో దేశ రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకోబోతోంది.

ప్రధాని నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసిలో ఆయనకు పోటీగా ప్రముఖ ట్రాన్స్‌జెండర్‌, శ్రీకృష్టుడి పరమ భక్తురాలు మహా మండలేశ్వర్‌ హేమాంగి సఖి మాను తలపడబోతోంది. ప్రస్తుతం ఆ పార్టీయే హేమాంగి సఖిని కూడా ప్రధాని మోదీపై తమ అభ్యర్థిగా నిలబెట్టింది. కాగా, అత్యధిక ఎంపీ సీట్లు ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌లో దాదాపు 20 స్థానాల్లో అఖిల భారత హిందూ మహాసభ (ఏబీహెచ్‌ఎం) అభ్యర్థులు పోటీ చేయనున్నారు. మరోవైపు అదే పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ రాయ్ మరోసారి పోటీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో మహా మండలేశ్వర్‌ హేమాంగి సఖి ప్రధానిపై గెలిచి నిలుస్తుందా.. లేక డిపాజిట్ కోల్పోతుందా.. తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Advertisement

Next Story