- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్‌సభ ఎన్నికల బరిలో పేద జాతీయ పార్టీ అభ్యర్థులు వీరే
దిశ, నేషనల్ బ్యూరో: 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే రెండు దశల పోలింగ్ పూర్తయింది. సాధారణంగా ఎన్నికల వేళ ఏ అభ్యర్థికి ఎంత ఆస్తి ఉంది, ఎన్ని కేసుల్లో వారి ప్రమేయడం వంటి అంశాలు చర్చకు వస్తాయి. ఇదే సమయంలో తాజాగా ఓ నివేదిక అనేక జాతీయ పార్టీలకు వారిలో పేద అభ్యర్థుల గురించి వివరాలను వెల్లడించింది. ఆ అభ్యర్థుల ఆస్తులు సగటు భారతీయ కుటుంబ ఆస్తి కంటే తక్కువగా ఉండటం గమనార్హం. జాతీయ పార్టీల్లో 2024 ఎన్నికల బరిలో ఫేజ్1, ఫేజ్2 పోటీలోని అభ్యర్థుల్లో బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)కి చెందిన రంజిత్ కుమార్ బాలుస్వామి(శివగంగ నియోజకవర్గం) అత్యల్ప ఆస్తులను కలిగి ఉన్నారు. ప్రముఖ ట్రాకర్‌మైనేత డాట్ ఇన్ఫో డేటా భారత ఎన్నికల సంఘం అఫిడవిట్‌లను ఆధారంగా నివేదికను రూపొందించింది. తమిళనాడుకు చెందిన బాలుస్వామి రూ. 23,000 విలువైన ఆస్తులు మాత్రమే ఉన్నాయని నివేదించారు. బీఎస్పీ ఉంచి అత్యంత సంపన్న అభ్యర్థి(సహ్రాన్‌పూర్ నుంచి మాజిద్ అలీ) రూ. 159 కోట్ల ఆస్తులను కలిగి ఉన్నారు.
ఆల్ ఇండియా డెట్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సర్వే, 2019 డేటా ప్రకారం, భారత గ్రామీణ కుటుంబ సగటు ఆస్తి రూ. 15.9 లక్షలు కాగా, పట్టణ కుటుంబం రూ. 27.2 లక్షల ఆస్తులను కలిగి ఉన్నాయి. దీన్ని బట్టి జాబితాలోని జాతీయ పార్టీ అభ్యర్థులు సగటు భారతీయుడి కంటే తక్కువ ఆస్తులను కలిగి ఉన్నారు. బాలుస్వామి తర్వాత కాంగ్రెస్ అభ్యర్థి ముఖేష్ ధంగర్(మధుర, యూపీ) రూ. 1.3 లక్షలు, బీజేపీకి చెందిన(మిజోరం) రూ. 11 లక్షలు, టీఎం థామస్ ఇసాక్(అలప్పి) రూ. 13.4 లక్షలు, నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందిన మజెల్ అంపరీన్ లింగ్డో(రూ. 2.2 కోట్లు), ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రిషిరాజ్ కౌండియన్(సోనిత్‌పూర్, అస్సాం) రూ. 2.9 కోట్ల ఆస్తులను వెల్లడించారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థీ ద్వారకా ప్రసా అత్యల్పంగా రూ. 1,000 ఆస్తులను ప్రకటించారు. బీజేపీకి చెందిన కృష్ణ జోయార్దార్ రూ. 6,200 ఆస్తులతో రెండో స్థానంలో ఉన్నారు.