- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేపే బీజేపీ మేనిఫెస్టో విడుదల.. ముహుర్తం ఖరారు
దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ మేనిఫెస్టోకు ముహుర్తం ఖరారైంది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేనిఫెస్టో తయారీకి రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది బీజేపీ హైకమాండ్. ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాత మేనిఫెస్టో తయారు చేసింది ఆ కమిటీ.
ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఇప్పటికే తన మేనిఫెస్టోను ప్రకటించింది. ఇప్పుడు బీజేపీ తమ సంకల్ప పత్రాన్ని విడుదల చేసేందుకు రెడీ అయ్యింది. కమలదళం తమ మేనిఫెస్టోను ఏప్రిల్ 14న విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఈ సంకల్ప పత్రాన్ని ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నాయి. మోడీ గ్యారెంటీ, వికసిత భారత్ థీమ్‌తో మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాల సమాచారం. అభివృద్ధి, దేశ శ్రేయస్సు, యువత, మహిళలు, పేదలు, రైతులే ప్రధాన అజెండాగా దీన్ని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
మేనిఫెస్టో రూపకల్పనకు రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని మొత్తం 27 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు అయ్యింది. ఇప్పటికే రెండు కీలక సమావేశాలు నిర్వహించింది. ప్రజల నుంచి కూడా సలహాలు, సూచనలు స్వీకరించింది. సంకల్ప పత్రం కోసం దాదాపు 15 లక్షల సూచనలు రాగా.. ఇందులో 4 లక్షలకు పైగా అభిప్రాయాలను ప్రజలు నమో యాప్ ద్వారా తెలియజేశారు. వాటన్నంటిని పరిశీలించిన కమిటీ మేనిఫెస్టోను రూపొందించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక కాంగ్రెస్ పార్టీ న్యాయ పత్రం పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. పంచ న్యాయాలు, 25 గ్యారంటీలను అందులో ప్రకటించింది. ఇక దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఏప్రిల్ 19న ప్రారంభం కాగా.. ఏప్రిల్ 26న రెండో విడత, మే 7, 13, 20, 25, జూన్ 1న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఎన్నికల ఫలితాలు రిలీజ్ కానున్నాయి. ఈసారి 400కు పైగా సీట్లు సాధిస్తామని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్షాల ఇండియా కూటమి కూడా విజయకేతన ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.