మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పీడీపీ.. అనంతనాగ్ బరిలో ముఫ్తీ

by S Gopi |
మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన పీడీపీ.. అనంతనాగ్ బరిలో ముఫ్తీ
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) చీఫ్ మెహబూబా ముఫ్తీ అనంతనాగ్ నియోజకవర్గం నుంచి డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీకి చెందిన గులాం నబీ ఆజాద్‌పై లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఆదివారం కశ్మీర్ లోయలోని మూడు సీట్ల అభ్యర్థులను ప్రకటించిన పీడీపీ.. పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు వహీద్ పరా, రాజ్యసభ సభ్యుడు మీర్ ఫయాజ్ బారాముల్లా శ్రీనగర్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, పార్టీ పార్లమెంటరీ బోర్డు చీఫ్ సర్తాజ్ మద్ని కలిసి వివరాలను తెలిపారు. జమ్మూ ప్రాంతంలోని ఉదంపూర్, జమ్మూలో కాంగ్రెస్ పార్టీకి మద్దతివ్వనున్నట్టు పేర్కొన్నారు. మరోవైపు, ఇండియా కూటమి నిర్ణయానికి విరుద్ధంగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. శ్రీనగర్ లోయలో పోటీ చేస్తున్న నేన్షనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)పై ఆమెతో పాటు మరో ఇద్దరు అభ్యర్థులు పోటీలో నిలిచారు. దీనిపై ఎన్సీకి చెందిన ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తి చేస్తూ, ఇండియా కూటమితో సీట్ల ఒప్పందం ద్వారా జమ్మూలోని రెండు స్థానాలను కాంగ్రెస్ పార్టీకి వదిలేశారని వెల్లడించారు.

Advertisement

Next Story