- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అయోధ్య రామ మందిర ఆలయ ప్రారంభోత్సవానికి రానున్న అద్వానీ
దిశ, నేషనల్ బ్యూరో: అయోధ్యలో జరిగే రామ మందిర ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ హాజరవుతారని వీహెచ్‌పీ అధ్యక్షుడు అలోక్ కుమార్ గురువారం తెలిపారు. అయితే, ఈ వేడుకకు పార్టీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి హాజరవుతారా లేదా అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. జనవరి 22న రామ మందిర ప్రారంభోత్సవానికి అద్వానీ వస్తారని, వీలైతే ఆయన కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయనున్నట్టు అలోక్ కుమార్ పేర్కొన్నారు. 1990ల ప్రారంభంలో అయోధ్య రామ మందిరం ఆందోళనలో కీలకంగా వ్యవహరించిన ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి ఈ కార్యక్రమానికి హాజరు కావడంలేదనే కథనాలు వెలువడ్డాయి. వారిద్దరి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రామ మందిర ప్రతిష్టాపనకు హాజరు కావొద్దని కోరినట్టు సమాచారం. అందుకు ఇద్దరూ అంగీకరించారని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు. అయితే, దీనిపై విమర్శలు రావడంతో వారిని అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టకు ఆహ్వానించారు.