Lindy cameron: ఆ విషయంలో భారత్ దే కీలక పాత్ర.. యూకే హైకమిషనర్ లిండీ కామెరూన్

by vinod kumar |
Lindy cameron: ఆ విషయంలో భారత్ దే కీలక పాత్ర.. యూకే హైకమిషనర్ లిండీ కామెరూన్
X

దిశ, నేషనల్ బ్యూరో: భవిష్యత్‌లో తక్కువ ఖర్చుతో కూడిన గ్రీన్ టెక్నాలజీని అభివృద్ధి చేసి, గ్లోబల్ సౌత్ ప్రయోజనాల కోసం దానిని బదిలీ చేయడంలో భారత్ కీలక పాత్ర పోషించగలదని ఇండియాలోని యూకే హై కమిషనర్ లిండీ కెమెరూన్ అన్నారు. ఎన్డీటీవీ వరల్డ్ సమ్మిట్ 2024 సెషన్‌లో భాగంగా ‘ఇండియన్ మ్యాటర్స్ మోస్ట్ ఫర్ ఫ్యూచర్ ఆఫ్ ప్లానెట్’ అనే అంశంపై జరిగిన చర్చలో ఆమె ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ విపత్తుల కారణంగా అనేక దేశాలు విధ్వంసానికి గురవుతున్నాయని తెలిపారు. ఈ సమయంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం ఎంతో అవసరమని నొక్కి చెప్పారు. సమిష్టిగా సవాళ్లను ఎదుర్కోవాలని సూచించారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు భారత్ చేపట్టే చర్యలకు యూకే మద్దతిస్తుందని చెప్పారు. సాంకేతికత, పరిశోధనకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. అభివృద్ధి చెందిన దేశాలు దేశీయంగా వాతావరణ మార్పులతో పోరాడటానికి తమ వ్యయాన్ని పెంచుతున్నారని, ఇది అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆర్థికంగా ప్రభావితం చేస్తోందన్నారు.

Advertisement

Next Story