Fake Paneer: నకిలీ పనీర్‌ను ఇలా గుర్తించండి.. మీ చేత్తో చిన్నటెస్ట్ చేస్తే చాలు..!!

by Anjali |
Fake Paneer: నకిలీ పనీర్‌ను ఇలా గుర్తించండి.. మీ చేత్తో చిన్నటెస్ట్ చేస్తే చాలు..!!
X

దిశ, వెబ్‌డెస్క్: పనీర్ చాలా మంది ఇష్టపడుతారు. పనీర్ తింటే ఎముకలు దృఢంగా ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉండటమే కాకుండా.. పనీర్‌లోని విటమిన్‌ డి, కాల్షియం మహిళలకు మేలు చేస్తుంది. జీర్ణక్రియకు మేలు చేస్తుంది. ఇమ్యూనిటి పవర్ పెంచడంలో తోడ్పడుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. అయితే పండుగల సమయాల్లోపనీర్ కూడా కల్తీ చేసే చాన్స్ ఉంటుంది. కాగా అసలైన పనీర్ ఎలా ఉంటుందో, సింథటిక్ పనీర్ అంటే ఏంటి? దాని నష్టాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం..

నకిలీ పనీర్ నే సింథటిక్ పనీర్ అంటారు. దీన్ని పాలతో కాకుండా వెజిటేబుల్ ఆయిల్, రసాయనాలు, పిండితో తయారు చేస్తారు. ఇది నిజమైన పనీర్ లాగే ఉంటుంది.సింథటిక్ పనీర్ తింటే ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. కడుపు ఉబ్బరం, విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. కల్తీ పదార్థాలు తినడం వల్ల క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదముందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కాగా నకిలీ పనీర్ ఎలా ఉంటుందో ఈ విధంగా తెలుసుకోండి. చేతుల మధ్య పనీర్ పెట్టి వేళ్లతో నలపండి. కల్తీలేని పనీర్ అయితే వెంటనే పిండిలాగా అవ్వదు. అలాగే పనీర్ తీసుకుని వాటర్ లో వేసి మరిగించండి. చల్లారాక అందులో కందిపప్పు పొడి వేయండి. కొంచెం సేపు తర్వాత అది లేద ఎరుపు రంగులోకి చేంజ్ అయితే యూరియా, డిటర్జెంట్ తో కల్తీ చేసినట్లు. కాగా పనీర్ కల్తీని ఈ విధంగా చెక్ చేయండి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed