- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ramayana: అలాంటి పాత్రలు చెయ్యడమే నాకు ఇష్టం.. స్టార్ హీరో వైరల్ కామెంట్స్
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడిగా, నేచురల్ బ్యూటీ సాయిపల్లవి (Sai Pallavi) సీతాదేవిగా నటిస్తున్న చిత్రం ‘రామాయణ’ (Ramayana). నితేశ్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు కన్నడ స్టార్ యశ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తుండటంతో మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అంతే కాకుండా ఈ మూలీలో యశ్ (Yash) రావణుడిగా నటిస్తున్నట్లు సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న యశ్ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ.. ‘ఉత్తరాది, దక్షిణాది నటులను ‘రామాయణ’లో భాగం చేయాలనుకున్నాం. అలాగే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా సాయి పల్లవిని సెలక్ట్ చేసింది డైరెక్టర్ నితేశ్ తివారీ (Nitesh Tiwari)నే. అయితే.. ఈ మూవీలో నన్ను వేరే ఏ పాత్ర చెయ్యమన్నా నేను నటించే వాడిని కాదు. కానీ ఓ నటుడిగా రావణుడి రోల్ (roll) ప్లే చేయడమే నాకు ఇష్టం. ఎందుకుంటే ఆ క్యారెక్టర్ (character) లో పలు షేడ్స్ ఉంటాయి’ అంటూ ఇండైరెక్ట్‌గా తాను రావణునుడి పాత్ర చేస్తున్నట్లు చెప్పకనే చెప్పాడు యశ్.