- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త ఎంపీలకు ప్రత్యేక సదుపాయాలు
దిశ, నేషనల్ బ్యూరో : 18వ లోక్ సభలో 280 మంది తొలిసారి ఎంపీగా ఎన్నికైన వారే ఉన్నారు. దాదాపు 52 శాతం మంది కొత్తవారే ఉన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచే అత్యధికంగా 45 మంది కొత్త ఎంపీలు ఉన్నారు. ఆ తర్వాత మహారాష్ట్ర నుంచి 33 మంది కొత్త ఎంపీలు ఉన్నారు. వారందరికీ కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక సదుపాయాలతోపాటు ఉచిత సౌకర్యాలను కల్పిస్తుంది. జీతం, ప్రయాణ భత్యాలు, వైద్య సదుపాయాలు, బంగ్లా, ఫోన్ సౌకర్యం, పెన్షన్ వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. వాటితో పాటు ఇంకా ఏం సౌకర్యాలు ఉన్నాయంటే?
అమల్లోకి కొత్త నిబంధనలు
2022 మే 11 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఆ నిబంధనల ప్రకారం ఒక్కొక్క ఎంపీకి నెలకు జీతంగా రూ.లక్ష అందుతుంది. అదనంగా, సమావేశాల కోసం అలవెన్సుల కింద రోజుకు రూ.2000 ఇస్తుంది. పార్లమెంట్ సమావేశాలకు, ఇతర అధికారిక కార్యక్రమాలకు హాజరయ్యేందుకు ఉచిత ప్రయాణ సదుపాయం లభిస్తుంది. అయితే, 15 రోజుల కంటే ఎక్కువ రోజులు పార్లమెంట్ సమావేశాలకు సెలవు పెట్టకుండా వచ్చిన వారికి మాత్రమే ట్రావెల్ రీయంబర్స్ మెంట్ కు అర్హులు. ఇంతేకాకుండా, ఎంపీలకు ఫస్ట్ క్లాస్ రైల్వే కోచ్ లలో ఉచితప్రయాణ సదుపాయంతో పాటు.. అండమాన్, నికోబార్ దీవులు, లక్షద్వీప్ ఎంపీలకు స్టీమర్ సౌకర్యం కల్పిస్తుంది. కాకపోతే, కుటుంబసభ్యులతో ప్రయాణించే సమయంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. పార్లమెంట్ సమావేశాలకు వచ్చి వెళ్లేందుకు మాత్రం ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది.
పెరిగిన పెన్షన్
ప్రతి ఎంపీకి ఆఫీస్ అలవెన్స్ కింద రూ.20,000, స్టేషనరీకి రూ. 4,000, పోస్టల్ ఛార్జ్ కోసం రూ.2000 కేంద్రం ఇస్తుంది. ఎంపీ సిబ్బంది జీతం కోసం కూడా నగదు చెల్లిస్తుంది. ప్రతి ఎంపీకి రెండు ఫాస్ట్ ట్యాగ్స్ ఫ్రీగా ఇస్తుంది. ఒకటి ఢిల్లీలోని వాహనానికి, మరోటి వారి సొంత వాహనానికి కేటాయిస్తుంది. ఇకపోతే, పదవీకాలం పూర్తయిన తర్వాత ప్రతి ఎంపీకి నెలవారి పెన్షన్ వస్తుంది. ఇటీవలే, ఈ పెన్షన్ మొత్తాన్ని నెలకు రూ.22 వేలకు పెంచింది.