Delhi News: కేజ్రీవాల్‌కు బదులుగా జాతీయజెండా ఆవిష్కరించనున్న కైలాష్ గహ్లోత్‌

by Harish |
Delhi News: కేజ్రీవాల్‌కు బదులుగా జాతీయజెండా ఆవిష్కరించనున్న కైలాష్ గహ్లోత్‌
X

దిశ, నేషనల్ బ్యూరో: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఢిల్లీలో తనకు బదులుగా మంత్రి అతిషి జాతీయజెండాను ఆవిష్కరిస్తారని లెఫ్టినెంట్ గవర్నర్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కోరగా, దీనికి ఢిల్లీ ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం (GAD) నిరాకరించారు. ఈ నేపథ్యంలో జెండా ఆవిష్కరణకు ఢిల్లీ హోంమంత్రి కైలాశ్‌ గహ్లోత్‌ పేరును గవర్నర్‌ వీకే సక్సేనా ప్రతిపాదించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఛత్రసాల్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను హోంమంత్రి ఆవిష్కరించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. హోం మంత్రి కైలాష్ గహ్లోత్‌ను నామినేట్ చేయడం సంతోషంగా ఉందని సక్సేనా అన్నారు.

అంతకుముందు రోజు, విద్యా మంత్రి అతిషి జాతీయ జెండాను ఎగురువేస్తారని ఆప్ నేత గోపాల్ రాయ్ ఢిల్లీ సాధారణ పరిపాలన విభాగంకు లేఖ రాశారు. అయితే కేజ్రీవాల్ అధికారాన్ని మంత్రి అతిషికి ఇవ్వలేమని వారు తెలిపారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగురవేస్తారనే దానిపై అనిశ్చితి నెలకొనగా, తాజాగా కైలాశ్‌ గహ్లోత్‌ పేరును ఎల్జీ సిఫార్స్ చేయడం గమనార్హం. ఇదిలా ఉంటే, జెండా ఆవిష్కరణకు అనుమతి ఇవ్వకపోవడంపై గవర్నర్‌ వీకే.సక్సేనాపై అతిషి విమర్శలు చేశారు, హక్కును కాలరాసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎల్జీ ఈ కార్యక్రమం నిర్వహించాలని చూస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed