- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వెంటిలేటర్లపై ఢిల్లీ ఆరోగ్య వ్యవస్థ.. లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా
దిశ, నేషనల్ బ్యూరో: లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం మధ్య నిత్యం ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది. ఇటీవల కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత ఈడీ కస్టడీ నుంచి ఆదేశాలు జారీ చేయడాన్ని వీకే సక్సేనా తప్పు పట్టారు. తాజాగా ఆయన దేశ రాజధానిలో ఆరోగ్య సేవల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ రాష్ట్రంలోని పరిస్థితులపై లెఫ్ట్‌నెట్ గవర్నర్‌కు లేఖ రాసిన నేపథ్యంలో శుక్రవారం దానికి బదులిచ్చిన సక్సేనా.. రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ వెంటిలేటర్లపై ఉందన్నారు. పరిస్థితిని మెరుగుపరిచేందుకు మంత్రికి రోడ్‌మ్యాప్ తయారు చేయాలని సూచించారు. ఈ విషయంలో ఢిల్లీ ప్రభుత్వం సక్సేనాపై ఎదురుదాడికి దిగింది. ఔషధాల కొరతకు కారణమైన అధికారులకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మద్దతిస్తున్నారని ఆరోపణలు చేసింది. వారంలో రెండుసార్లు భరద్వాజ్‌ను సమావేశానికి పిలిచారని, కానీ రాలేదని ఎల్‌జీ చెప్పారు. బాధ్యులపై చర్యలకు సంబంధించి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఎన్‌సీసీఎస్ఏ సమావేశం ద్వారా చేయాలి. గత 6 నెలలుగా సీఎం ఈ సమావేశానికి పిలవలేదని తెలిపారు. ఈ క్రమంలోనే మంత్రి తన బాధ్యతల నుంచి తప్పించుకోవాలని అనుకుంటున్నారని సక్సేనా పేర్కొన్నారు. దీన్ని బట్టి ఢిల్లీ హెల్త్ మోడల్ గురించి మాట్లాడుకుంటే ఆసుపత్రులలో కాటన్ కూడా లేదని, ఢిల్లీ ఆరోగ్య వ్యవస్థ వెంటిలేటర్‌పైనే ఉన్నట్టు కనిపిస్తోంది. 9 ఏళ్లలో ఢిల్లీ ప్రభుత్వం ఒకే ఒక ఆసుపత్రిని నిర్మించిందని వెల్లడించారు.