సెక్స్‌కు కనీస వయోపరిమితిపై కేంద్ర ప్రభుత్వాన్ని సలహా కోరిన లా కమిషన్

by Vinod kumar |   ( Updated:2023-06-16 21:59:10.0  )
సెక్స్‌కు కనీస వయోపరిమితిపై కేంద్ర ప్రభుత్వాన్ని సలహా కోరిన లా కమిషన్
X

న్యూఢిల్లీ: ఏకాభిప్రాయంతో సెక్స్‌కు కనీస వయోపరిమితి ఎంత ఉండొచ్చు..? అనే దానిపై కేంద్ర ప్రభుత్వం నుంచి లా కమిషన్ సూచనలు కోరింది. ప్రస్తుతం ఈ వయో పరిమితి 18 సంవత్సరాలుగా ఉంది. కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ నుంచి లా కమిషన్ ఈమేరకు ఇటీవల అభిప్రాయాన్ని కోరింది. ఇటువంటి కేసులపై కర్ణాటక హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టుల పరిశీలనలను లా కమిషన్ ఈసందర్భంగా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. టీనేజర్ల మధ్య పరస్పర సంబంధాల కేసుల్లో.. బాలిక సమ్మతి ఉన్నప్పటికీ ఆమె వయసు 18 ఏళ్లలోపు ఉంటే అబ్బాయిపై అత్యాచారం కేసును నమోదు చేయాలని పోక్సో చట్టం స్పష్టం చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఏకాభిప్రాయంతో సెక్స్‌ లో పాల్గొనే విషయంలో టీనేజీ బాలికల కనీస వయో పరిమితిని తగ్గించాలని పలువురు ఇటీవల డిమాండ్ చేశారు. ఏకాభిప్రాయంతో సెక్స్‌కు సంబంధించిన కనీస వయోపరిమితిని 2012లో 18 ఏళ్లకు పెంచారు. ఇది అబ్బాయిలు, అమ్మాయిలు ఇద్దరికీ వర్తిస్తుంది. ఏకాభిప్రాయంతో సెక్స్‌కు కనీస వయోపరిమితి 13 సంవత్సరాలే ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్, బొలీవియా, బోస్నియా, హెర్జెగోవినా, జపాన్, స్పెయిన్, అర్జెంటీనా ఉన్నాయి. పాకిస్తాన్, సౌదీ అరేబియా, యెమెన్, ఇరాన్ వంటి దేశాలలో వివాహేతర సంబంధాలు కలిగి ఉండటం చట్టవిరుద్ధం.

ఇవి కూడా చదవండి: పక్కింటి వారి భార్యను దొంగిలిస్తేనే అక్కడి యువకులకు పెళ్లి..

Advertisement

Next Story