- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండియాలో ఫస్ట్‌టైమ్ పురుషుల కంటే స్త్రీలు ఎక్కువయ్యారు!!
దిశ, వెబ్‌డెస్క్ః ఈ రోజు మార్చి 8, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదర్భంగా భారతదేశం గర్వంగా చెప్పుకోదగిన ఘనతను సాధించింది. ఈ దేశంలో మొదటిసారి పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉందని ఇటీవలి జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం భారతదేశంలో ప్రతి 1,000 మంది పురుషులకు 1,020 మంది మహిళలు ఉన్నారు. 1951లో 1,000 మంది పురుషులకు 946 మంది స్త్రీలు ఉండగా, 2015 నాటికి, ఈ సంఖ్య 1,000 మంది పురుషులకు 991 మంది స్త్రీలకు చేరుకుంది. ఇలా క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన ఈ సర్వే రిపోర్టు కాస్త ఊరటనిచ్చింది.
గ్రామాల్లోనే ఎక్కువ
అయితే, ఈ రిపోర్టులో చింతించాల్సిన విషయమూ లేకపోలేదు. సర్వే ప్రకారం, దేశంలో స్త్రీ భృణహత్యలు ప్రధాన సమస్యగా మిగిలిపోయింది. మగ పిల్లలతో పోలిస్తే ఆడ బిడ్డకు ఇక్కడ జీవించే అవకాశాలు తక్కువయ్యాయి. ఆశ్చర్యకరంగా, నగరాలతో పోలిస్తే గ్రామాల్లోనే బాలికలు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో తేలింది. గ్రామాల్లో ప్రతి 1,000 మంది పురుషులకు 1,037 మంది మహిళలు ఉన్నారు. నగరాల్లోని నిష్పత్తిని పరిశీలిస్తే, ప్రతి 1,000 మంది పురుషులకు 985 మంది స్త్రీలు ఉన్నారు. చదువుకొని, ఆధునిక సంస్కృతిని పాటిస్తున్న నగరాల్లో స్త్రీలకు మనుగడ లేకపోవడం ఆశ్చర్యంతో పాటు ఆవేదన కలిగించే అంశం.
వృత్తి పరంగా అభివృద్ధి
ఇక, యూఎస్, యూకే, జర్మనీ దేశాల కంటే ఇండియాలో సైన్స్, మ్యాథమెటిక్స్ గ్రాడ్యుయేట్‌లలో మహిళలే ఎక్కవ. ఇండియాలో 43% ఉండగా, ఈ సంఖ్య, యునైటెడ్ స్టేట్స్‌లో 34%, యునైటెడ్ కింగ్‌డమ్‌లో 38%, జర్మనీలో 27% గా ఉంది. అలాగే, ఇక్కడ ఉద్యోగాల కల్పనలో కూడా మహిళలు అద్భుతమైన కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. దేశంలో నమోదైన 50,000 స్టార్టప్‌లలో 45% మహిళా పారిశ్రామికవేత్తలే ఉండటం గమనార్హం. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ప్రకారం, మహిళలు స్థాపించిన లేదా సహ-స్థాపించిన స్టార్టప్‌లు ఐదేళ్ల కాలంలో పురుషుల కంటే 10% ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి. ఈ స్టార్టప్‌లు మరింత సమగ్రమైన వర్క్ కల్చర్‌ను కలిగి ఉండగా, వీళ్లు పురుషుల కంటే మూడు రెట్లు ఎక్కువ మంది మహిళలను నియమించుకుంటున్నారు. ఇది మహిళల యుగానికి నాంది పలికినట్లేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
'ఆమె' నేతృత్వంలో వృద్ధి
బోస్టన్ కన్సల్టింగ్ పరిశోధన ప్రకారం మహిళల నేతృత్వంలోని వ్యాపారాలు రాబోయే 5 సంవత్సరాల్లో 90% పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. అలాగే, 2030 నాటికి 30 మిలియన్లకు పైగా కంపెనీలు మహిళల యాజమాన్యంలో ఉంటాయని, అవి 15 నుండి 17 కోట్ల ఉద్యోగాలను సృష్టిస్తాయని అంచనా వేస్తున్నారు. ఇక, ప్రస్తుతం భారతదేశంలో, స్టార్టప్‌లతో పాటు 1.57 కోట్లకు పైగా వ్యాపార సంస్థలు మహిళల యాజమాన్యంలో ఉన్నట్లు తెలుస్తుంది. మహిళలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలతో పాటు, MSME వ్యాపారం కోసం పురుషుల నుండి రుణాలు తీసుకుంటున్నారు. ఇందులో మహిళలు రూ.20.82 లక్షల కోట్లు రుణం తీసుకోగా, పురుషులు వ్యాపారం కోసం రూ.11.56 కోట్లు రుణం తీసుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి.