పవర్ స్టేషన్ పై విరిగి పడిన కొండచరియలు

by M.Rajitha |
పవర్ స్టేషన్ పై విరిగి పడిన కొండచరియలు
X

దిశ, వెబ్ డెస్క్ : సిక్కింలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడుతున్నాయి. మంగళవారం ఉదయం తీస్తా ప్రాజెక్టుకు చెందిన ఓ పవర్ స్టేషన్ పై కొండచరియలు విరిగి పడి అది కూలిపోయింది. జాతీయ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పోరేషన్ నిర్వహిస్తున్న ఈ పవర్ స్టేషన్ 510 మెగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే గత కొద్దిరోజులుగా ఈ పవర్ స్టేషన్ పై భాగాన గల కొండా చరియలు కొద్ది కొద్దిగా విరిగి పడుతుండటంతో ముందుగానే ఇందులో సిబ్బందిని ఖాళీ చేయించారు. అందువల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ప్రస్తుతం ఈ పవర్ స్టేషన్ కూలిపోయే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story