- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కోహ్లీ' గొప్ప నటుడు.. సినిమాల్లోకి వస్తే మా పని గోవిందా! కాస్టింగ్ డైరెక్టర్ ముఖేష్
దిశ, వెబ్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ గొప్ప నటుడని.. అయితే అతను సినిమాల్లోకి మాత్రం రావొద్దని అంటున్నాడు కాస్టింగ్ డైరెక్టర్, నటుడు ముఖేష్ ఛబ్రా. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత క్రీడారంగంలోనే కొనసాగాలని, సినిమాలలోకి మాత్రం అస్సలు రావొద్దని అన్నారు. కోహ్లీ వ్యక్తిగతంగానూ, తన భార్య అనుష్క శర్మ తో కలిసి కూడా అనేక టీవీ యాడ్స్ లలో నటించిన సంగతి తెల్సిందే. అయితే రీసెంట్ గా, రణవీర్ అల్లాబాడియా పోడ్ కాస్ట్ షో లో కాస్టింగ్ డైరెక్టర్ ముకేశ్ ఛబ్రా మాట్లాడుతూ.. "విరాట్ కోహ్లీ గొప్ప నటుడని, అతడు ఢిల్లీకి చెందిన వాడు అయినప్పటికీ, పంజాబీ కుటుంబం నుంచి వచ్చి జీవితాన్నే చదివేశాడని అన్నాడు. అతన్ని ఏ రకంగా చూసినా అన్నింట్లో గొప్పవాడని, లుక్స్ పరంగా, ఫిట్నెస్ లోనూ, మానసికంగానూ, కామెడీ టైమింగ్ లోనూ.. ఇలా చెప్తూ పోతే కోహ్లీ ఆల్ రౌండ్ ప్రతిభ కనబరుస్తాడని అన్నాడు. దీంతో పాటు అతని మిమిక్రీ టైమింగ్ కూడా అద్భుతమని కొనియాడాడు. అయితే రిటైర్మెంట్ తర్వాత మాత్రం కోహ్లీ సినిమాల్లోకి మాత్రం రాకూడదు" అని ముఖేష్ వెల్లడించాడు.