- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జాతీయం-అంతర్జాతీయం > Good news for farmers: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి భారీగా పెంపు
Good news for farmers: రైతులకు కేంద్రం గుడ్ న్యూస్.. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి భారీగా పెంపు
by Prasad Jukanti |

X
దిశ, డైనమిక్ బ్యూరో: 2025-26 కేంద్ర బడ్జెట్ ను (Union Budget 2025-26) ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం రైతులకు తీపి కబురు చెప్పింది. కిసాన్ క్రెడిట్ కార్డుల (Kisan Credit Card) పరిమితిని పెంచింది. రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ స్పీచ్ లో వెల్లడించారు. ఈ నిర్ణయంతో 7.7 కోట్ల మంది రైతులకు యప్రయోజనం కలగనుందని తెలిపారు. కేసీసీ పరిమితి చాలా కాలంగా సవరించలేదు. తాజాగా ఈ పరిమితిని పెంచుతూ తీసుకున్న నిర్ణయం రైతాంగానికి ఊరట కలిగించనున్నది. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే రుణాలకు వడ్డీ 4 శాతం లేదా అంతకన్నా తక్కువగా ఉంటుంది. ఈ కార్డు పొందిన వారికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, జీవన జ్యోతి బీమా యోజన వర్తిస్తుంది.
Next Story