Kharge: మీ పాత స్పీచ్‌లు వైఫల్యాలను కప్పిపుచ్చలేవు.. ఏఐసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
Kharge: మీ పాత స్పీచ్‌లు వైఫల్యాలను కప్పిపుచ్చలేవు.. ఏఐసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: భారత ఆర్థిక వ్యవస్థకు మోడీనామిక్స్ ఒక శాపంగా మారిందని, వారి పాత స్పీచ్ లు బీజేపీ వైఫల్యాలను కప్పిపుచ్చలేవని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. భారత ఆర్థిక వృద్దిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. మీ పాత ఉపన్యాసాలలోని అదే స్పీచ్‌లు భారత ఆర్ధిక వ్యవస్థలోని వైఫల్యాలను కప్పిపుచ్చలేవని సంచలన వ్యాఖ్యలు చేశారు. నిత్యావసరాల ధరలు 2014 నుంచి ఇప్పటివరకు దాదాపు 241 శాతం పెరిగాయని, జీడీపీ పరంగా గృహ రుణాలు 40 శాతం ఆల్ టైమ్ గరిష్ట స్థాయిలో ఉన్నాయని, సేవింగ్స్ 50 ఏళ్ల కనిష్టానికి చేరాయని తెలిపారు. అలాగే బీజేపీ విధించిన ధరల పెరుగుదల, అసంఘటిత రంగం నాశనమే ఈ గందరగోళానికి కారణమని మండిపడ్డారు.

అంతేగాక ఈ పదేళ్లలో 'మేక్ ఇన్ ఇండియా' అద్భుతంగా విఫలమైందని, ఎందుకంటే కాంగ్రెస్-యుపీఎ కాలంలో భారతదేశంలో పెరిగిన ఎగుమతుల లాభాలు మీ విధానాల ద్వారా విస్మరించబడ్డాయని అన్నారు. ఇక సూరత్‌లోని వజ్రాల కార్మికులు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని, కార్మికుల జీతాలు 30 శాతం వరకు తగ్గించబడ్డాయని తెలిపారు. అంతేగాక ప్రధాన డైమండ్ యూనిట్లు వారానికి 4 రోజులు మాత్రమే పనిచేయవలసి వస్తుందని, గత 6 నెలల్లో 60 మందికి పైగా వజ్రాల కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. ఎమ్‌జీఎన్ఆర్ఈజీఏ పై కాంగ్రెస్ పార్టీని కార్నర్ చేసేందుకు.. ఈ పథకానికి ఎక్కువ నిధులు కేటాయించడంలో ఉద్దేశపూర్వకంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఇక భారత ఆర్థిక వ్యవస్థకు 'మోడీనామిక్స్' శాపం అయ్యిందని ఖర్గే రాసుకొచ్చారు.

Advertisement

Next Story