- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేంద్రం చెప్పేది అబద్ధమని ఆర్బీఐ రిపోర్టుతో తేలిపోయింది.. ఖర్గే
న్యూఢిల్లీ : ద్రవ్యోల్బణంపై కేంద్ర ప్రభుత్వం వినిపిస్తున్న వాదనను కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తప్పుపట్టారు. ద్రవ్యోల్బణం వల్లే దేశ ప్రజల తలసరి వ్యయం తగ్గిపోయిందని.. అమ్మకాలు డౌన్ అయ్యాయని సాక్షాత్తు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా నివేదిక చెప్పిందన్నారు. ఈమేరకు ఆయన శనివారం ట్వీట్ చేశారు. “ద్రవ్యోల్బణం ఉందని కాంగ్రెస్ చెబితే.. ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు ద్రవ్యోల్బణం కనిపించడం లేదని వాదించారు. ఇప్పుడు ఆర్‌బీఐ ఇచ్చిన నివేదికపై మీ స్పందన ఏమిటి ? " అని ఖర్గే ప్రశ్నించారు.
కేంద్ర ప్రభుత్వ వాదనలో వాస్తవికత లేదని ఆర్‌బీఐ రిపోర్ట్ తో తేలిపోయిందన్నారు. "ద్రవ్యోల్బణం కారణంగా దేశంలో ప్రైవేటు పెట్టుబడులు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఆర్‌బీఐ అంటోంది. ఈ దుర్మార్గపు చక్రం మన ఆర్థిక వ్యవస్థకు ప్రాణాంతకం. మంచి రోజులు అంటే ఇవేనా ? " అని కామెంట్ చేశారు. కాగా, ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ మైఖేల్ దేవవ్రత పాత్ర నేతృత్వంలోని నిపుణుల బృందం ద్రవ్యోల్బణంపై ఈ స్టడీ పేపర్ ను రూపొందించింది.