- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కోర్టుకు వెళ్లే ముందు కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయనను కోర్టుకు తీసుకువెళ్తుండగా ఏదైనా సందేశం ఇవ్వాలనుకుంటున్నారా?అని అక్కడ ఉన్న ఓ మీడియా ప్రతినిధి అడుగగా అందుకు కేజ్రీవాల్ రియాక్ట్ అయ్యారు. 'నా జీవితం దేశానికి సమర్పితం. నేను లోపల ఉన్న బయట ఉన్న దేశం కోసం పని చేస్తుంటా' అని చెప్పుకుంటూ కోర్టు లోపలికి వెళ్లిపోయారు. ఇక రౌస్ అవెన్యూ కోర్టులో కేజ్రీవాల్ ను ప్రవేశపెట్టిన ఈడీ.. లిక్కర్ కుంభకోణం కోసులో కీలక సూత్రధారి కేజ్రీవాల్ అని ఆరోపించింది. ఈ కేసులో మరింత విచారించేందుకు ఆయనను 10 రోజుల పాటు రిమాండ్ కు ఇవ్వాలని కోర్టును కోరింది. మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్ పై ఆప్ నేతలు మండిపడుతున్నారు. కేజ్రీవాల్ అంటే ఓ వ్యక్తి కాదని ఓ సిద్ధాంతం అని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ అన్నారు. ఆప్ శ్రేణులంతా ఆయన వెంట ఉన్నాయని చెప్పారు.