Court Order: మహిళ అభ్యర్థనపై హైకోర్టు కీలక తీర్పు.. భర్త వీర్యాన్ని సేకరించేందుకు అనుమతి

by Ramesh Goud |
Court Order: మహిళ అభ్యర్థనపై హైకోర్టు కీలక తీర్పు.. భర్త వీర్యాన్ని సేకరించేందుకు అనుమతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఓ మహిళ అభ్యర్థనపై కేరళ హైకోర్టు కీలక తీర్పును వెళువరించింది. మృత్యువుతో పోరాడుతున్న ఆ మహిళ భర్త వీర్యాన్ని సేకరించి, భద్రపరిచేందుకు కోర్టు అనుమతించింది. కేరళలో ఓ మహిళ తన భర్త తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ.. ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని, తమకు పిల్లలు లేని కారణంగా.. భవిష్యత్తులో తాను సంతానం కనడానికి ఉపయోగపడేలా తన భర్త వీర్యాన్ని సేకరించడానికి అనుమతి ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించింది. భర్త పరిస్థితి విషమంగా ఉండటం వల్ల అతని అనుమతి తీసుకోలేకపోయానని, దీనిపై కోర్టు త్వరగా నిర్ణయం తీసుకోవాలని, ఆలస్యం చేస్తే భర్త ప్రాణాలకు మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని కోర్టుకు విన్నవించుకుంది. దీనిపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు జడ్జి వీజీ అరుణ్ కీలక తీర్పునిచ్చారు. ఆ మహిళ అభ్యర్దనకు సానుకూలంగా స్పందిస్తూ.. భర్త వీర్యం సేకరించి, భద్రపరచడానికి అనుమతి మంజూరు చేశారు. అయితే దానికి మినహా మరే చర్యలు చేపట్టవద్దని నిబంధనలు విధించారు. దీనిపై తదుపరి విచారణను వచ్చే నెల 9కి వాయిదా వేస్తున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story