హిమాచల్‌ప్రదేశ్‌లో కీలక పరిణామం: కేబినెట్ మంత్రి రాజీనామా.. సీఎంపై ఆగ్రహం

by samatah |
హిమాచల్‌ప్రదేశ్‌లో కీలక పరిణామం: కేబినెట్ మంత్రి రాజీనామా.. సీఎంపై ఆగ్రహం
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజకీయ సంక్షోభం నెలకొన్న వేళ హిమాచల్ ప్రదేశ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య తన మంత్రి పదవికి బుధవారం రాజీనామా చేశారు. సీఎం సుఖ్వింధర్ సింగ్ సుఖు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి సహకారంతో ఏర్పడిన ప్రభుత్వంలో ఎమ్మెల్యేలను పట్టించుకోలేదని, అంతేగాక పదే పదే అవమానించారని అవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల గొంతులను అణచివేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం పరిస్థితికి పరిష్కారం కాంగ్రెస్ హై కమాండ్ చేతిలో ఉందని, వారి నిర్ణయం మేరకు నడుచుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ జరిగిన మరుసటి రోజే విక్రమాదిత్య మంత్రి పదవికి రాజీనామా చేయడం కీలకంగా మారింది. దీంతో తాజా రాజకీయ పరిణామాలపై రాష్ట్రంలో ఉత్కంఠ నెలకొంది. కాగా, విక్రమాదిత్య సిమ్లా రూరల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన గతంలోనూ రామమందిర ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టారు. మరోవైపు సీఎం సుఖును సీఎం పదవి నుంచి తప్పిస్తే..తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని రెబల్ ఎమ్మెల్యే రాజేంద్ర రాణా డిమాండ్ చేశారు.

Advertisement

Next Story