రామ జన్మభూమి ట్రస్టు కీలక నిర్ణయం: ఆ కార్యక్రమం రద్దు

by samatah |
రామ జన్మభూమి ట్రస్టు కీలక నిర్ణయం: ఆ కార్యక్రమం రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 17న జరగాల్సిన కొత్త రామ్ లల్లా విగ్రహం ఊరేగింపును రద్దు చేసింది. భద్రతా పరమైన కారణాలతో ఈ డెసిషన్ తీసుకున్నట్టు తెలిపింది. ఊరేగింపునకు బదులుగా అదే రోజు నూతన విగ్రహాన్ని చూసేందుకు భక్తులను అనుమతించనున్నారు. శ్రీరామ జన్మభూమి ట్రస్టు సభ్యులు కాశీలోని సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అధికారులతో సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. రాముని విగ్రహాన్ని నగరంలోకి తీసుకెళ్లినప్పుడు భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని, వారిని నియంత్రించడం కష్టం అవుతుందని ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ట్రస్టు ఊరేగింపు ప్రోగ్రాంను రద్దు చేసింది. కాగా, అంతకుముందు రామమందిరం గర్భగుడి పూర్తి అయిందని, ఈ నెల 22న జరగనున్న ప్రాణ ప్రతిష్ట వేడుక కోసం వేచి ఉందని అయోధ్య ట్రస్టు ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed