Kerala: కేరళ ఆరోగ్యమంత్రికి ప్రమాదం.. స్వల్పగాయాలు

by Shamantha N |
Kerala: కేరళ ఆరోగ్యమంత్రికి ప్రమాదం.. స్వల్పగాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ప్రయణిస్తున్నకారు ప్రమాదానికి గురైంది. మలప్పురం జిల్లా మంజేరి సమీపంలో ఈ యక్సిడెంట్ జరిగింది. కొండచరియలు విరిగిపడిన ప్రాంతనికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో వీణా జర్జ్ కు స్వల్పగాయాలయ్యాయి. ప్రస్తుతం మంజేరి మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

రెడ్ అలెర్ట్

వయనాడ్ సహా కేరళలోని ఉత్తర జిల్లాలకు ఐఎండీ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. బుధవారం 20 సెంటీమీటర్ల కన్నా అధికంగా వర్షం కురిసే అవకాశం ఉందంది. వయనాడ్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్, ఇడుక్కి, త్రిసూర్‌లకు రెడ్ అలర్ట్‌ ప్రకటించింది. పతినంతిట్ట, అలప్పుజా, కొట్టాయం, ఎర్నాకులం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. పతనంతిట్ట, ఎర్నాకులం, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్, వాయనాడ్, కన్నూర్, కాసర్‌గోడ్ జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా అన్ని విద్యసంస్థలకు సెలవులు ప్రకటించారు. వర్షాల వల్ల కేరళలో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. కనీసం పలు రైళ్లు రద్దు చేయగా.. మరికొన్ని రీ షెడ్యూల్ అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed