- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేరళను పొలిటికల్ ఏటీఎంగా మార్చారు..రాహుల్ నిర్ణయంపై బీజేపీ ఫైర్
దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎట్టకేలకు తెరదించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కేరళలోని వయనాడ్, ఉత్తరప్రదేశ్‌లోని రాయ్ బరేలీ లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసి గెలిచిన రాహుల్..వయనాడ్ స్థానాన్ని వదులుకుని.. రాయ్ బరేలీ నుంచి ఎంపీగా కంటిన్యూ కావాలని డిసైడ్ అయ్యారు. ఈ మేరకు సోమవారం ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ సమక్షంలో జరిగిన సమావేశం అనంతరం రాహుల్ ఈ విషయాన్ని వెల్లడించారు. సిట్టింగ్ స్థానమైన వయనాడ్ సెగ్మెంట్‌ను వదులుకోనున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రాహుల్ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. వయనాడ్ సీటును వదులుకోవడం అంత సులభమైన నిర్ణయం కాదన్నారు. ఇక్కడ ప్రజలకు ఇచ్చిన అన్నీ హామీలను నెరవేరుస్తామని తెలిపారు. వయనాడ్‌కు ఇక నుంచి ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఉంటారని, తన సోదరి ప్రియాంకతో పాటు ఇక్కడి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని చెప్పారు. ‘వయనాడ్, రాయబరేలి ప్రాంతాలతో నా బంధం ప్రత్యేకమైంది. రెండు ప్రాంతాల ప్రజలు నాపై ఎంతో ప్రేమను చూపారు. అయితే రాయ్ బరేలీతో మా కుటుంబానికి ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపారు. గత ఐదేళ్లుగా తనకు మద్దతిచ్చిన వయనాడ్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
వయనాడ్ నుంచి బరిలోకి ప్రియాంక
వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి ఉపఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. రాహుల్‌కి, ఆయన కుటుంబానికి తరతరాలుగా సన్నిహితంగా ఉన్నందున రాయ్‌బరేలీ సీటు నుంచి రాహుల్ ఎంపీగా ఉంటారని చెప్పారు. ఇది పార్టీకి కూడా ఎంతో మేలు చేస్తుందని ఆకాంక్షించారు. ప్రియాంకా గాంధీ మాట్లాడుతూ..వయనాడ్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం రాబోతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాహుల్ లేని లోటును రానివ్వబోనని, ఎంతో కష్టపడి పని చేసి మంచి ప్రజా ప్రతినిధిగా ఉండటానికి కృష్టి చేస్తానని తెలిపారు. యూపీలోని రాయ్‌బరేలీ, అమేథీతోనూ చాలా పాత సంబంధం ఉందని, దానిని విచ్ఛిన్నం చేయలేమని స్పష్టం చేశారు.
కేరళను పొలిటికల్ ఏటీఎంగా మార్చారు: రాష్ట్ర బీజేపీ చీఫ్ సురేంద్రన్
వయనాడ్ సీటును వదులుకోవాలన్న రాహుల్ నిర్ణయంపై కేరళ బీజేపీ చీఫ్ సురేంద్రన్ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పొలిటికల్ ఏటీఎంలా పరిగణిస్తోందని మండిపడ్డారు. వయనాడ్ ప్రజల నమ్మకాన్ని రాహుల్ నిలబెట్టుకోలేక పోయారన్నారు. ఈ పరిణామాన్ని బీజేపీ ముందుగానే ఊహించిందని చెప్పారు. రాజకీయ లబ్ది కోసం మాత్రమే రాహుల్ కేరళ వైపు చూశారని, అవసరం అయిపోగానే వదిలివేస్తున్నారన్నారు. కాగా, గత ఎన్నికల్లో రాహుల్‌పై సురేంద్రన్ పోటీ చేశారు. మరోవైపు ప్రియాంక వయనాడ్‌లో బరిలోకి దిగడాన్ని కేరళ కాంగ్రెస్ యూనిట్ స్వాగతించింది.