- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బీజేపీకి సాయం చేసేందుకే ఇదంతా.. కేరళ సీఎంపై మండిపడ్డ కాంగ్రెస్
దిశ, నేషనల్ బ్యూరో: కేరళ సీఎం పినరయి విజయన్ పై విమర్శలు గుప్పించింది కాంగ్రెస్. తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వీడీ సతీశన్. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సాయం చేసేందుకే కాంగ్రెస్ ను, రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
ఎన్నికల వేళ కేరళ ప్రభుత్వం సాధించిన విజయాలేమీ లేవని.. పాలనా వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే తమ పార్టీపై విమర్శలు చేస్తున్నారని సతీశన్. గత నెలరోజులుగా విజయన్ బీజేపీని, ప్రధాని మోడీపై ఎలాంటి విమర్శలు చేయట్లేదన్నారు. కావాలనే కాంగ్రెస్, రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
కేరళలో హై-స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలనే లక్ష్యంతో రూ.1,500 కోట్లతో కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్‌వర్క్ ప్రాజెక్టును చేపట్టారని అన్నారు. ప్రాజెక్టును ప్రారంభించి ఏడేళ్లు గడిచినా నేటికీ పూర్తి చేయకపోవడం పినరయి ప్రభుత్వ అవినీతికి నిదర్శమనమన్నారు. ఈ ప్రాజెక్ట్‌పై సీబీఐ విచారణ జరిపించాలని సతీశన్ డిమాండ్ చేశారు. డిప్లమాటిక్ బ్యాగ్‌ల కేసు, సహకార బ్యాంకు కుంభకోణంతో సహా పలు ఆర్థిక కుంభకోణాల్లో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. అందుకే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడేందుకు పినరయి విజయన్ భయపడుతున్నారని ఆరోపించారు.