- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > జాతీయం-అంతర్జాతీయం > కేజ్రీవాల్ ఫ్యూచర్ కనిపిస్తోంది.. ఆయనకూ సిసోడియా గతే: బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ
కేజ్రీవాల్ ఫ్యూచర్ కనిపిస్తోంది.. ఆయనకూ సిసోడియా గతే: బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ
by Harish |

X
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ మనోజ్ తీవారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లో నూతన మద్యం పాలసీ అవకతవకల్లో అరెస్టయిన మాజీ మంత్రి సిసోడియా తరహాలోనే కేజ్రీవాల్ అరెస్ట్ అవుతారని విమర్శించారు. ఢిల్లీ సీఎం భవిష్యత్తు తనకు కనిపిస్తుందని అన్నారు. సిసోడియ కు పట్టిన గతే.. కేజ్రీవాల్ కి పడుతుందని నొక్కి చెప్పారు. ‘భవిష్యత్తులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు జైలు శిక్ష పడిన మంత్రులు సిసోడియా, సత్యేందర్ జైన్‌ల గతి తప్పదని నేను స్పష్టంగా ఊహించగలను. మీరు మనిషిని మోసం చేయవచ్చు.. కానీ దేవుడిని మోసం చేయలేరు. ఢిల్లీ ఖజానా కొల్లగొట్టిన తీరు దారుణం. ఏ నేరస్థుడు లేదా అవినీతిపరుడు తప్పించుకోగలడని నేను అనుకోను' అని మనోజ్ తివారీ అన్నారు. సీబీఐ అరెస్ట్ తో జైలు శిక్ష అనుభవిస్తున్న సిసోడియాను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Next Story