సీబీఐ అరెస్ట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్

by Harish |   ( Updated:2024-07-01 07:45:17.0  )
సీబీఐ అరెస్ట్‌పై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల కేజ్రీవాల్‌ను మూడు రోజుల కస్టడీకి పంపగా, అది ఈ శనివారంతో ముగిసింది. దీంతో రౌస్ అవెన్యూ కోర్టు ఆయన్ను తిరిగి జులై 12 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఈ నేపథ్యంలో ఆయన దీనిని వ్యతిరేకిస్తూ, హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతకుముందు కేజ్రీవాల్‌ మూడు రోజుల కస్టడీ ముగిసన తరువాత సీబీఐ కోర్టులో హాజరుపరుచగా, ఆయన దర్యాప్తుకు సహకరించడం లేదని, ఉద్దేశపూర్వకంగా తప్పించుకునే సమాధానాలు ఇచ్చారని, 2021-22 మధ్య కాలంలో గోవా రాష్ట్ర ఎన్నికల కోసం తన పార్టీ ద్వారా రూ. 44.54 కోట్ల అక్రమంగా సంపాదించిన డబ్బు బదిలీ, వినియోగానికి సంబంధించిన ప్రశ్నలను కూడా ఆయన సరైన సమాధానాలు ఇవ్వడం లేదని,అలాగే ఈ కేసులో మరింత మంది సాక్షులను విచారించాల్సిన అవసరం ఉందని కేజ్రీవాల్‌ను సీబీఐ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీని కోరింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఆయనను సీబీఐ జూన్ 26న అరెస్ట్ చేసింది.

Advertisement

Next Story