Kedarnath Yatra :కేదార్‌నాథ్ యాత్రకు రెండురోజుల బ్రేక్.. కారణం అదే

by Hajipasha |   ( Updated:2024-08-01 17:44:15.0  )
Kedarnath Yatra :కేదార్‌నాథ్ యాత్రకు రెండురోజుల బ్రేక్.. కారణం అదే
X

దిశ, నేషనల్ బ్యూరో : ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ, రుద్రప్రయాగ్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కేదార్‌నాథ్ యాత్రను రెండురోజుల పాటు(శుక్ర, శనివారాలు) తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆ రాష్ట్ర డీజీపీ అభినవ్ కుమార్ వెల్లడించారు. ‘‘గురువారం ఉదయం సమయానికి దాదాపు 1000 మంది భక్తులు కేదార్‌నాథ్‌లో ఉన్నారు. మరో 800 మంది భక్తులు ట్రెక్ మార్గంలో ఉన్నారు. వారందరిని సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు రెస్క్యూటీమ్స్ రంగంలోకి దిగాయి’’ అని ఆయన తెలిపారు. ఇందుకోసం 12 ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్స్, 60 ఎస్‌డీఆర్ఎఫ్ టీమ్స్, వాయుసేన హెలికాప్టర్లు, ప్రైవేటు హెలికాప్టర్లను వాడుతున్నట్లు డీజీపీ అభినవ్ చెప్పారు.

వచ్చే రెండు రోజుల్లో భారీ వర్షాలు కురవొచ్చనే అంచనాల నడుమ కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేసి, ఈమేరకు ఏర్పాట్లు చేసినట్లు డీజీపీ చెప్పారు. భక్తుల భద్రత కోసం.. యమునోత్రి, కేదార్‌నాథ్ ట్రెక్ రూట్లలో రాకపోకలపై పరిమితులు విధించినట్లు పేర్కొన్నారు. ఈనేపథ్యంలో తెహ్రీ, రుద్రప్రయాగ్ ప్రాంతాల్లోని వర్ష ప్రభావిత ప్రాంతాలను ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్‌సింగ్ ధామి బుధవారం రాత్రి సందర్శించారు. గురువారం ఉదయం కూడా ఆయా చోట్ల ముఖ్యమంత్రి పర్యటన కొనసాగింది. ప్రభావిత ప్రాంతాల్లో అలర్ట్‌గా ఉండాలని.. ప్రజలకు సాయం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed