‘ఇది హిందువుల అతిపెద్ద విజయం’.. జ్ఞానవాసీ మసీదు కేసుపై కాశీవిశ్వనాథ్ ట్రస్ట్ కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:2024-01-31 11:06:59.0  )
‘ఇది హిందువుల అతిపెద్ద విజయం’..  జ్ఞానవాసీ మసీదు కేసుపై   కాశీవిశ్వనాథ్ ట్రస్ట్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన జ్ఞానవాపీ మసీదు కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జ్ఞానవాపీ మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు వారణాసి కోర్టు హిందువులకు అనుమతి ఇచ్చింది. వారం రోజుల్లోగా హిందువులు మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని చేయాలని సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది. కాగా, జ్ఞానవాసీ మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకునేందుకు కోర్టు పర్మిషన్ ఇవ్వడంపై కాశీవిశ్వనాథ్ ట్రస్ట్ స్పందించింది.

పూజలకు అనుమతి రావడం కోట్లాది మంది హిందువుల అతిపెద్ద విజయమని సంతోషం వ్యక్తం చేసింది. వారం రోజుల్లోగా మసీదు ప్రాంగణంలో పూజలు ప్రారంభిస్తామని తెలిపింది. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని జ్ఞానవాసీ మసీదు కేసు దేశంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ మసీదు కింద ఆలయం ఉందని.. ఆలయాన్ని కూలగొట్టి ఈ మసీదును నిర్మించారని హిందువులు కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన.. కోర్టు మసీదులో సర్వే చేసి నివేదిక ఇవ్వాలని ఏఎస్ఐ డిపార్ట్ మెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది.

మసీదులో సర్వే చేసిన ఆర్కియాలజీ డిపార్ట్‌మెంట్ నివేదికను ఇటీవల కోర్టుకు సమర్పించింది. ఏఎస్ఐ రిపోర్ట్‌లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మసీదు కింద ఆలయం ఉంది నిజమేనని.. ఆలయాన్ని కూలగొట్టే మసీదును నిర్మించినట్లు అధికారులు చేసిన సర్వేలో తేలింది. మసీదు కింద హిందువు దేవుళ్ల విగ్రహాలు, శాసనాలు సైతం లభ్యం అయ్యాయి. ఈ క్రమంలో మసీదు ప్రాంగణంలో హిందువులు పూజలు చేసేకునేందుకు కోర్టు అనుమతి ఇవ్వడం హాట్ టాపిక్‌గా మారింది.

Read More: జ్ఞానవాపి మసీదు కేసులో వారణాసి కోర్టు కీలక తీర్పు

Advertisement

Next Story

Most Viewed