- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ బిల్లు రద్దు
బెంగళూరు : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బలవంతపు మత మార్పిడులకు వ్యతిరేకంగా బీజేపీ హయాంలో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది. మంత్రివర్గ సమావేశం అనంతరం ఈవిషయాన్ని రాష్ట్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్‌కే పాటిల్ మీడియాకు తెలిపారు. బలవంతపు మత మార్పిడుల వ్యతిరేక చట్టం అనేది మైనారిటీలను వేధించే సాధనంగా ఉండటం వల్లే రద్దు చేస్తున్నామని చెప్పారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) వ్యవస్థాపకులలో ఒకరైన వీ.డీ.సావర్కర్, కే.బీ.హెడ్గేవార్‌లపై చరిత్ర పుస్తకాల్లో బీజేపీ సర్కారు గత సంవత్సరం జోడించిన పాఠాలను తొలగించాలని క్యాబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు. పాఠశాల సిలబస్‌లో బీజేపీ ప్రభుత్వం చేసిన అన్ని మార్పులను తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇకపై పాఠశాలలు, కళాశాలల్లో శ్లోకంతో పాటు రాజ్యాంగ ప్రవేశికను కూడా తప్పనిసరిగా స్టూడెంట్స్ చదవాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. బీజేపీ హయాంలో చేసిన చట్టం స్థానంలో వ్యవసాయ మార్కెట్ల (ఏపీఎంసీ)పై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కర్ణాటక క్యాబినెట్ డిసైడ్ చేసింది.