Karnataka : 20న కర్ణాటకలో మద్యం దుకాణాలు బంద్

by Hajipasha |
Karnataka : 20న కర్ణాటకలో మద్యం దుకాణాలు బంద్
X

దిశ, నేషనల్ బ్యూరో : కర్ణాటక(Karnataka)లోని మద్యం దుకాణాలు నవంబరు 20న మూతపడనున్నాయి. ఎక్సైజ్ శాఖలోని అవినీతి, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోనితనాన్ని నిరసిస్తూ ఆ రోజున మద్యం అమ్మకాలను నిలిపివేస్తామని కర్ణాటక మద్యం వ్యాపారుల సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి బి.గోవిందరాజ హెగ్డే ప్రకటించారు. తమ ఒక్కరోజు నిరసన వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.120 కోట్ల నష్టం కలుగుతుందన్నారు.

నవంబరు 20న బెంగళూరులోని ఫ్రీడం పార్కు వద్ద తమ సమాఖ్య(liquor sellers) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. లంచాల కోసం ఎక్సైజ్ అధికారుల వేధింపులు, యథేచ్ఛగా సాగుతున్న కల్తీ లిక్కర్ అమ్మకాలతో తాము విసిగి వేసారి పోయామని బి.గోవిందరాజ హెగ్డే చెప్పారు. తమ డిమాండ్లపై చర్చించేందుకు ఎక్సైజ్, పోలీసు విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం సిద్ధరామయ్యను కోరారు. రాష్ట్ర ఆర్థిక శాఖలో ఎక్సైజ్ విభాగాన్ని విలీనం చేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed