Dies In Accident : పోస్టింగ్ మొదటి రోజే మృత్యుఒడిలోకి.. ప్రమాదంలో యువ ఐపీఎస్ మృతి

by Ramesh N |
Dies In Accident : పోస్టింగ్ మొదటి రోజే మృత్యుఒడిలోకి.. ప్రమాదంలో యువ ఐపీఎస్ మృతి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎంతో కష్టపడి చదివి ఉన్నత ఉద్యోగం సాధించి తొలి రోజు విధులు నిర్వర్తించేందుకు వెళ్తుండగా ఓ యువ ఐపీఎస్ మృత్యుఓడిలోకి చేరాడు. ఇటీవలే శిక్షణ పూర్తి చేసుకున్న హర్ష్‌బర్ధన్ అనే యువ ఐపీఎస్ అధికారి ఆదివారం కర్ణాటకలోని హాసన్ జిల్లాలో తన మొదటి పోస్టింగ్‌ని స్వీకరించేందుకు వెళ్తుండగా ప్రమాదంలో మరణించారు. హర్ష్‌బర్ధన్ (26) మధ్యప్రదేశ్‌ నివాసి, కర్ణాటక కేడర్‌కు చెందిన 2023 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. అయితే ఆయన ప్రయాణిస్తున్న వాహనం టైరు పగిలిపోవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. దీంతో ఐపీఎస్ బర్ధన్ తలకు బలమైన గాయాలు కావడంతో ఆసుప్రతిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కావడంతో చికిత్స పొందుతున్నారు.

ఈ ఘటనపై సోమవారం ఎక్స్ వేదికగా కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. ‘హసన్-మైసూరు హైవేలోని కిట్టనే సరిహద్దు సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రొబేషనరీ ఐపీఎస్ అధికారి హర్ష్‌బర్ధన్ మృతి చెందడం బాధాకరం. ఆయన ఐపీఎస్ అధికారిగా బాధ్యతలు స్వీకరించేందుకు వెళుతుండగా ఇలాంటి ప్రమాదం జరగడం చాలా బాధాకరం. ఏళ్ల తరబడి శ్రమ ఫలిస్తున్నప్పుడు ఇలా జరగకూడదు. హర్ష్‌బర్ధన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి’ అని సిద్ధరామయ్య తెలిపారు.

Advertisement

Next Story