ముస్లింల రిజర్వేషన్‌ విషయంలో సర్కార్ కీలక నిర్ణయం.. కోర్టుకు వెళతామని బీజేపీ ప్రకటన

by Gantepaka Srikanth |
ముస్లింల రిజర్వేషన్‌ విషయంలో సర్కార్ కీలక నిర్ణయం.. కోర్టుకు వెళతామని బీజేపీ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ముస్లిం రిజర్వేషన్ల(Muslim Reservations) విషయంలో కర్ణాటక ప్రభుత్వం(Karnataka Government) కీలక నిర్ణయం తీసుకున్నది. కాంట్రాక్టుల్లో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్ట సవరణ చేసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీ(BJP) శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాన్ని ఖండిస్తున్నామని.. దీనిపై అతి త్వరలో కోర్టుకు వెళతామని ప్రకటన చేశారు. కాగా, ప్రభుత్వ నిర్ణయంతో కేటీపీపీ చ‌ట్టం ప్ర‌కారం కేట‌గిరీ 2బీ కింద ఉన్న ముస్లిం కాంట్రాక్ట‌ర్లు సుమారు రెండు కోట్ల మేర ప్ర‌భుత్వ ప‌నులు చేసేందుకు అర్హులు అవుతారు.

ప్ర‌స్తుత అసెంబ్లీ సెష‌న్‌(Assembly Session)లో స‌వ‌ర‌ణ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌న త‌ర్వాత‌.. ముస్లిం కాంట్రాక్ట‌ర్ల కోటాను అమ‌లు చేస్తామ‌ని సీఎం సిద్ద‌రామ‌య్య తెలిపారు. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కేంద్రం అభినందించింది. ఇ-పాలనలో 2024 ఏడాదికి కర్ణాటక ప్రభుత్వానికి కేంద్రం నుంచి బంగారు పతకం లభించింది. ప్రతిసారీ ఇ-పాలనలో కర్ణాటక ప్రభుత్వం(Karnataka Government) చక్కని పనితీరును చూపిస్తూ వస్తోందని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) తెలిపారు. బంగారు పతకాన్ని దక్కించుకునేలా మెరుగైన పనితీరును చూపిస్తున్న అధికారులు, సిబ్బందిని ఆయన ప్రశంసించారు.

Next Story