కేంద్రంతో కర్ణాటక ప్రభుత్వం అనవసరంగా గొడవకు దిగుతోంది: హెచ్‌డీ కుమారస్వామి

by S Gopi |
కేంద్రంతో కర్ణాటక ప్రభుత్వం అనవసరంగా గొడవకు దిగుతోంది: హెచ్‌డీ కుమారస్వామి
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్నాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో అనవసరంగా గొడవకు దిగుతోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ఆరోపించారు. ఈ ధోరణి వల్ల ప్రయోజనాలు శూన్యమని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీ నాయకత్వం తనపై నమ్మకం ఉంచిందని, వారి అంచనాలకు తగినట్టు పని చేయాలని భావిస్తున్నట్టు కుమారస్వామి పేర్కొన్నారు. అయితే, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో అనవసరంగా వివాదం దిశగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అటువంటి వైరం సహాయం చేయదని, కేంద్రం ప్రభుత్వంపై బురద చల్లడం వల్ల ప్రయోజనం ఉండదు, చర్చించేందుకు రావాలని అభ్యర్థిస్తున్నట్టు చెప్పారు. పీటీఐ మాట్లాడుతూ.. పరస్పర సహకారంతో రాష్ట్ర ప్రయోజనాలు పొందవచ్చు. కానీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు కేంద్రంపై బహిరంగంగా విమర్శలు చేస్తూ, అనవసరంగా చిక్కులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి. కర్ణాటకకే తన ప్రాధాన్యత ఉంటుందని, అయితే దేశం మొత్తం కేంద్ర మంత్రిగా దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఇదే సమయంలో ప్రధాని తనకు ఉక్కు, భారీ పరిశ్రమలు వంటి రెండు సున్నితమైన శాఖలను అప్పగించారు. వాటిపై అధ్యయనానికే కనీసం 3 నెలల సమయం పడుతుంది. కేంద్ర ప్రభుత్వంలో పనిచేయడం తొలిసారి అని, నేర్చుకోవాల్సింది చాలా ఉందని కుమారస్వామి వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed