- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
హమారే బారా మూవీపై నిషేధం విధించిన కర్ణాటక ప్రభుత్వం
దిశ, నేషనల్ బ్యూరో: ‘హమారే బారా‘ మూవీ గురించి దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఈ మూవీ ఉందని విమర్శలు వస్తున్నాయి. కాగా..ముస్లిం మహిళల గురించి తెరకెక్కిన ‘ హమారే బారా ‘ సినిమాపై కర్ణాటకలో నిషేధం విధించారు. రెండు వారాల పాటు తాత్కాలికంగా ఈ సినిమాను నిషేధిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. ఈ సినిమా ప్రదర్శనను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సినిమా ప్రదర్శించడం వల్ల మత సామరస్యానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో సినిమాపై నిషేధం విధించింది. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, ఫిల్మ్ థియేటర్‌లు, ప్రైవేట్ టెలివిజన్ ఛానెల్‌లు, ఇతర అవుట్‌లెట్‌లతో సహా అన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాను, ట్రైలర్ ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.
‘ హమారే బారా ‘ చిత్ర బృందం ఏం చెప్పిందంటే?
మరోవైపు ‘ హమారే బారా ‘ చిత్ర బృందం తమ సినిమాలో ఏ మతాన్ని చెడుగా చూపించలేదంటోంది. ఈ చిత్రంలో అన్నూ కపూర్, పార్థ్ సమతాన్, అశ్విని కల్సేకర్, మనోజ్ జోషి, పరితోష్ త్రిపాఠి, రాహుల్ బగ్గా కీలక పాత్రలు పోషించారు. రవి ఎస్ గుప్తా, బీరేందర్ భగత్, సంజయ్ నాగ్‌పాల్ సంయుక్తంగా నిర్మించారు. కమల్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ మూవీకి రాజన్ అగర్వాల్ స్క్రీన్ ప్లే అందించారు.