Family Suicide : అప్పుల బాధ తాళలేక.. వాగులోకి దూకి దంపతుల సూసైడ్

by Hajipasha |
Family Suicide : అప్పుల బాధ తాళలేక.. వాగులోకి దూకి దంపతుల సూసైడ్
X

దిశ, నేషనల్ బ్యూరో : అప్పుల బాధను తాళలేకపోయారు. అప్పులను తిరిగి చెల్లించలేకపోతున్నందుకు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఈ ఆవేదనలోనే దంపతులు తమ కుమార్తెతో కలిసి కర్ణాటకలోని హేమావతి కెనాల్‌లోకి దూకి ప్రాణాలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. హసన్ జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్ (43) ఒక క్యాబ్ డ్రైవర్. ఆయన భార్య శ్వేత (36) ఒక స్కూల్ టీచర్. వీరి కుమార్తె పేరు నాగశ్రీ (13). ఆగస్టు 11న ఈ ముగ్గురు కలిసి ఇంటి నుంచి బయలుదేరారు. నాటి నుంచి ప్రతిరోజూ కుటుంబీకులు, సన్నిహితులు వారి ఆచూకీ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు.

అయినా వారు ఎక్కడికి వెళ్లారు ? ప్రస్తుతం ఎలా ఉన్నారు ? అనేది తెలియరాలేదు. ఈక్రమంలోనే ఆగస్టు 13న చంబరాయపట్న పోలీసు స్టేషనులో ఈ ముగ్గురికి సంబంధించిన మిస్సింగ్ కేసును నమోదు చేశారు. హసన్ జిల్లా కేంద్రానికి 40 కిలోమీటర్ల దూరంలోని బాగుర్ హుబ్లీ ప్రాంతం సమీపంలో ఉన్న ఒక కెనాల్‌లో శ్రీనివాస్, శ్వేత దంపతుల డెడ్‌బాడీస్ లభ్యమయ్యాయి. వారి కుమార్తె నాగశ్రీ ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. వీరు కెనాల్‌లోకి దూకి ప్రాణాలు తీసుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Advertisement

Next Story