- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చన్నపట్న బైపోల్ బరిలో డీకే శివకుమార్ ?
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అసెంబ్లీ ఉపఎన్నికల బరిలో దిగనున్నారు. జేడీఎస్ నేత కుమారస్వామి ప్రాతినిధ్యం వహిస్తున్న చన్నపట్న అసెంబ్లీకి ఉపఎన్నిక జరగనుంది. కాగా.. ఆ స్థానంలో కాంగ్రెస్ నుంచి ఎవరు పోటీ చేయనున్నారనే ఆసక్తిగా మారింది. మీడియా సమావేశంలో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. తాను ప్రజా నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని.. వారు కోరుకుంటే తప్పకుండా పోటీ చేస్తానని తెలిపారు. చన్నపట్న నుంచే తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని. నాలుగు సార్లు గెలిచినట్లు చెప్పుకొచ్చారు. చన్నపట్ల ప్రజలు తనను ఆశీర్వదించారని.. తన మనసులో వారికి ప్రత్యేక స్థానం ఉందన్నారు. చన్నపట్న అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కొన్నిరోజుల్లో అక్కడ పర్యటించనున్నట్లు ప్రకటించారు. ఓటర్లు, స్థానిక నాయకులు తాను పోటీ చేయాలని కోరుకుంటే.. వారి అభిప్రాయాన్ని తప్పకుండా గౌరవిస్తానని పేర్కొన్నారు.
సోదరుడి కోసం డీకే ప్లాన్
ప్రస్తుతం శివకుమార్ కనకపుర స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు, ఎంపీగా గెలిచిన హెచ్డీ కుమారస్వామి కేంద్రమంత్రి పదవి చేపట్టారు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న చన్నపట్న అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉంది. అక్కడ్నుంచి నుంచి శివకుమార్ గెలిస్తే.. ప్రస్తుతం తాను ఎమ్మెల్యేగా ఉన్న కనకపుర స్థానం నుంచి సురేశ్‌ను పోటీలో దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో శివకుమార్ సోదరుడు డీకే సురేశ్ ఓటమిపాలయ్యారు. దీంతో, సోదరుడి కోసం మరోసారి ఎన్నికల్లో డీకే పోటీ చేయనున్నారు.