- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అసెంబ్లీలో చెవిలో పువ్వుతో మాజీ సీఎం..
బెంగళూరు: కర్ణాటకలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య వచ్చిన తీరు అందరి దృష్టిని ఆకర్షించింది. చెవిలో పూలు ధరించిన ఆయన అసెంబ్లీలో అలాగే కూర్చున్నారు. బడ్జెట్ కేటాయింపుల విషయంలో ప్రజలను మోసగిస్తుందని ఆయన విమర్శించారు. 2018 మేనిఫెస్టోలోని హామీలను గతేడాది బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందని ఆరోపించారు. బడ్జెట్‌తో ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన 600 వాగ్దానాల్లో 10 శాతం కూడా నెరవేర్చ లేకపోయిందని మండిపడ్డారు.
కాగా, సిద్ధరామయ్య వలె కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు చెవిలో పూలు ధరించారు. మరోవైపు విధానసౌధలో సీఎం బసవరాజ్ బొమ్మై బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది మిగులు బడ్జెట్ అని పేర్కొన్నారు. బడ్జెట్ వ్యయం మొదటిసారిగా రూ.3 లక్షల కోట్లు దాటింది. 2022-23 లో రూ.2,65,720 లక్షల కోట్ల నుంచి రూ.3,09,182 కోట్లకు చేరుకుంది. రైతులు, విద్యార్థులు, మహిళలు, రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం కల్పిస్తూ ప్రధానంగా నిధులు కేటాయింపులు చేశారు. ఇక మరో మూడు నెలల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.