- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కర్ణాటక సీఎం, మంత్రులకు బాంబు బెదిరింపులు..!
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక ప్రభుత్వానికి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో ఒక్కసారిగా అలెర్టయ్యింది అక్కడి యంత్రాంగం. బెంగళూరులో శనివారం పేలుడు జరుగుతుందని బెదిరింపు మెయిల్ పంపాడు ఓ వ్యక్తి. కన్నడ సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి, బెంగళూరు సీపీలను ఉద్దేశించి ఓ వ్యక్తి ఈమెయిల్ పంపాడు.
[email protected] అనే మెయిల్ ఐడీ నుంచి బెదిరింపులు వచ్చాయి. కాగా..ఈ-మెయిల్ పంపిన వ్యక్తిని షాహిద్ ఖాన్‌గా గుర్తించారు. ఈమెయిల్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం శనివారం మధ్యాహ్నం 2.48 గంటలకు రెస్టారెంట్లు, ఆలయాలు, బస్సులు, రైళ్లు వంటి రద్దీ ప్రదేశాల్లో పేలుడు జరుగుతుందని హెచ్చరించాడు.
బహిరంగ ప్రదేశాలు, కార్యక్రమాలల్లోనూ బాంబులను కూడా అమరుస్తామని మెయిల్ పంపిన వ్యక్తి బెదిరించాడు. పేలుడును ఆపేందుకు రూ. 20 కోట్లుపైగా చెల్లించాలని మెయిల్ లో డిమాండ్ చేశారు. మరోవైపు బెంగళూరు సిటీ క్రైం బ్రాంచ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన దర్యాప్తు చేపడుతున్నారు.