- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ప్రిన్సిపాల్ తిట్టాడని ఒంటికి నిప్పంటించుకున్న విద్యార్థి
హవేరీ: ప్రిన్సిపాల్ తిట్టాడనే కారణంతో ఓ విద్యార్థి ఆత్మహత్య యత్నం చేశాడు. కర్ణాటకలోని హవేరీలో పీయూసీ చదువుతున్న ఓ విద్యార్థి తన అమ్మమ్మ ఇంట్లో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం, హంగల్‌కు చెందిన విద్యార్థి, తన తల్లిదండ్రులను వదిలి హవేరీలో అమ్మమ్మ దగ్గర ఉంటూ పీయూసీ చదువుతున్నాడు. అయితే, చదువు ఇష్టం లేక తరచూ క్లాసులకు గైర్హాజరయ్యారు. దీంతో అకడమిక్ పనితీరు దెబ్బతినడం, హాజరు సరిగా లేకపోవడంతో ఆందోళన చెందిన ప్రిన్సిపాల్ అతని తల్లిదండ్రులను పిలిపించాడు.
విద్యార్థికి చదువుపై ఆసక్తి లేకపోవడం, పరీక్షల్లో ఫెయిల్ అవుతుండటం వంటి అంశాల గురించి వారితో చర్చించారు. అదే సమయంలో కొంత పరుషంగా తిట్టాడు. దీనికి మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన కాలేజీ ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడని, అందుకే తాను నిప్పంటించుకున్నానని విద్యార్థి చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి విచారణను కొనసాగిస్తున్నట్టు పేర్కొన్నారు.