Karge: ప్రమాదంలో జాతీయ భద్రత.. మోడీ ప్రభుత్వంపై ఖర్గే ఫైర్

by vinod kumar |
Karge: ప్రమాదంలో జాతీయ భద్రత.. మోడీ ప్రభుత్వంపై ఖర్గే ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా 90 కొత్త గ్రామాలను స్థిరపరుస్తోందని వెలువడుతున్న కథనాలపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Malli karjun karge) స్పందించారు. మోడీ ప్రభుత్వం భారతదేశ జాతీయ భద్రత (National security), ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వాన్ని ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘ఎన్డీఏ ప్రభుత్వం పీఆర్ స్టంట్స్, తప్పడు ప్రకటనలకే ప్రాధాన్యతనిస్తోంది. నేషనల్ సెక్యురిటీని ఏ మాత్రం పట్టించుకోవడం లేదు’ అని తెలిపారు. చైనాకు రెడ్ సెల్యూట్ చేసే విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. ఫలితంగా జాతీయ భద్రత ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం సరిహద్దుల్లో వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ను భాగా ప్రోత్సహిస్తున్నట్టు ప్రగల్భాలు పలుకుతోందని, కానీ ఈ పథాకానికి కేటాయించిన 90 శాతం నిధులు గత రెండేళ్లలో ఖర్చు కాలేదని ఆరోపించారు. ఈ పథకం ఫిబ్రవరి 2023లో ప్రారంభించగా.. రూ.4,800 కోట్ల నిధులు కేటాయిస్తే కేవలం రూ.509 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో 75 గ్రామాలను మెరుగుపరచాల్సిన అవసరం ఉందని, కేంద్రంలోని ప్రభుత్వం దానికి నిధులు ఇవ్వలేదని తెలిపారు. 2024 డిసెంబర్‌లో చైనా బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట నిర్మించాలని ప్రణాళికలు ప్రకటించిందని, ఇది మన జాతీయ భద్రత, పర్యావరణం, ఈశాన్య రాష్ట్రాలకు ప్రమాదకరమని తెలిపారు.

Next Story

Most Viewed