Kanwar Yatra : కన్వర్ యాత్ర మార్గంలో ‘నేమ్‌ప్లేట్ల’ వ్యవహారంపై ‘సుప్రీం’లో పిటిషన్

by Hajipasha |
Kanwar Yatra : కన్వర్ యాత్ర మార్గంలో ‘నేమ్‌ప్లేట్ల’ వ్యవహారంపై ‘సుప్రీం’లో పిటిషన్
X

దిశ, నేషనల్ బ్యూరో : కన్వర్ యాత్ర జరిగే మార్గంలోని దుకాణాల నిర్వాహకులు తమ పేర్లతో నేమ్ ప్లేట్లను ఏర్పాటు చేయాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆదివారం రోజు అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను న్యాయమూర్తులు జస్టిస్ హృషికేష్ రాయ్, జస్టిస్ ఎస్‌వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం సోమవారం (జులై 22న) విచారించనుంది. వాస్తవానికి దుకాణాల ఎదుట నేమ్ ప్లేట్లు ఏర్పాటు చేయాలనే ఆదేశాన్ని తొలుత యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఇచ్చారు.

గత శుక్రవారం అదే ఆర్డర్‌ను కన్వర్ యాత్ర జరిగే మొత్తం మార్గానికి వర్తింపజేస్తూ యూపీ సర్కారు ఉత్తర్వులు విడుదల చేసింది. ఇటీవల ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ.. కన్వర్ యాత్రను పురస్కరించుకొని తమ రాష్ట్రంలోనూ ఇలాంటి సూచనలే అమల్లో ఉన్నాయన్నారు. ఇక యూపీ సర్కారు ఆదేశాలను బాబా రాందేవ్ సమర్ధించారు. మన పేర్లు చెప్పుకోవడానికి మనమంతా గర్వపడాలన్నారు. ‘‘తన గురించి చెప్పుకునేందుకు రాందేవ్‌కు సమస్య లేనప్పుడు.. రహమాన్‌కు మాత్రం సమస్యేంటి ? ప్రతి ఒక్కరూ వారి పేరును చెప్పుకునేందుకు గర్వించాలి’’ అని వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed