జ్ఞాన్‌వాపి వ్య‌వ‌హారంలో కంగ‌నా ర‌నౌత్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు (వీడియో)

by Sumithra |
జ్ఞాన్‌వాపి వ్య‌వ‌హారంలో కంగ‌నా ర‌నౌత్‌ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు (వీడియో)
X

దిశ‌, వెబ్‌డెస్క్ః ఈ దేశంలో ప్ర‌జా స‌మ‌స్యల‌కు కొద‌వు లేదు. కానీ, మ‌త‌మే ప్ర‌ధాన ప్ర‌జా స‌మ‌స్య‌లా మారుతున్న ప‌రిణామం క‌నిపిస్తోంది. అస‌లు, ఏ మ‌తం బోధించినా దేవుడు అంద‌రిలో ఉంటాడ‌నీ, దైవం స‌ర్వాత‌ర్యామి అని చెబుతోంది. కానీ, ఇక్క‌డి ప్ర‌జ‌లు మాత్రం దేవుడు ఆ ఒక్క‌చోటే ఉంటాడ‌న్న‌ట్లు భావిస్తుంటారేమో గానీ, అదే ప‌విత్ర‌ స్థ‌లం అంటూ శాంతి సామ‌ర‌స్యాల‌ను స‌ర్వ‌నాశ‌నం చేయ‌డానికైనా వెనుకాడ‌న‌ట్లు క‌నిపిస్తారు. క‌ర్నాట‌క హిజాబ్ స‌క్సెస్ త‌ర్వాత వ‌రుస‌గా కొన‌సాగిన వివాదాల విజ‌యంలో ఇటీవ‌ల‌ జ్ఞానవాపి సమస్య వెలుగులోకి వ‌చ్చింది. అయితే, ప్ర‌స్తుతం కోర్టులో తుది తీర్పు కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న త‌రుణంలో నటి కంగనా రనౌత్ ఈ అంశంపై తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శివుడు సర్వవ్యాపి అని, ఆయ‌న‌ ఉనికిని నిరూపించుకోవడానికి ఒక నిర్మాణం అవసరం లేదని అన్నారు.

బాలివుడ్ 'లేడీ టైగ‌ర్' రనౌత్, బుధవారం తన తాజా చిత్రం 'ధాకడ్' బృందంతో కలిసి కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రార్థనలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మాట్లాడుతూ, "మధురలోని ప్రతి కణంలో కృష్ణుడు, అయోధ్యలోని ప్రతి కణంలో రాముడు ఉన్నట్లే, కాశీలోని ప్రతి కణంలో శివుడు ఉన్నాడు. అతనికి నిర్మాణం అవసరం లేదు, ప్రతి కణంలో ఉన్నాడు" అని వ్యాఖ్యానించారు. వెంట‌నే 'హర్ హర్ మహాదేవ్' శ్లోకం చెబుతూ త‌న భ‌క్తి ప్ర‌ప‌త్తుల‌ను చూపించారు.

Advertisement

Next Story

Most Viewed