గెలిస్తే అతివాద అధ్యక్షురాలిగా మిగిలిపోతారు - కమలా హ్యారిస్ పై ట్రంప్ విమర్శలు

by Shamantha N |
గెలిస్తే అతివాద అధ్యక్షురాలిగా మిగిలిపోతారు - కమలా హ్యారిస్ పై ట్రంప్ విమర్శలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్ష బరిలో డెమొక్రాటిక్ పార్టీ తరఫున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ నిలిచారు. కాగా.. రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కమలా హ్యారిపై విరుచుకు పడ్డారు. ఒకవేళ ఆమె ఎన్నికల్లో గెలిస్తే.. అతివాద అధ్యక్షురాలిగా చరిత్రలో మిగిలిపోతారని ధ్వజమెత్తారు. ఫ్లోరిడాలో జరిగిన ‘ది బిలీవర్స్ సమ్మిట్’ లో ఆయన ప్రసంగించారు. ‘కమలా హ్యారిస్‌ కు ప్రజాదరణ తగ్గిపోయింది. ఒకవేళ గెలిస్తే అత్యంత తీవ్రమైన అతివాద అధ్యక్షురాలిగా అమెరికా చరిత్రలో మిగిలిపోతారు. దేశ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను సరిగ్గా నిర్వహించలేదు. దేశంలోకి ఎంతోమంది అక్రమ వలసదారులు ప్రవేశించారు. వారిని అడ్డుకోలేకపోయారు. వైస్ ప్రెసిడెంట్ గా ఆమె ఒక ఫెయిల్యూర్’ అని అన్నారు.

సోషలిజాన్ని ఓడించడమే మా పని

‘అత్యంత వామపక్ష డెమోక్రట్ల సెనేటర్‌ జాబితాలో కమలా హారిస్‌ మొదటి స్థానంలో ఉంటారు. సెనేటర్‌గా హ్యారిస్ మొత్తం సెనేట్‌లో అత్యంత వామపక్ష డెమొక్రాట్‌గా నంబర్ వన్ స్థానంలో నిలిచారు. ఆమె అధికారంలోకి వస్తే దేశ వ్యాప్తంగా వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేస్తారు. ఆ భావజాలం కలిగిన న్యాయమూర్తులనే నియమిస్తారనడంలో సందేహం లేదు.అందుకే ఎన్నికల్లో ఆమె గెలవడం అసాధ్యం. మా పని సోషలిజాన్ని ఓడించడం. మార్క్సిజం, కమ్యూనిజం, కార్టెల్స్, నేరస్థులు, అక్రమ రవాణాను నిరోధించడం మన ముందున్న లక్ష్యం. దేశంలో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కరిస్తా’ అని ట్రంప్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed