న్యాయవ్యవస్థ ప్రమాదంలో ఉంది: సీజేఐకి 600మందికి పైగా న్యాయవాదుల లేఖ

by samatah |
న్యాయవ్యవస్థ ప్రమాదంలో ఉంది: సీజేఐకి 600మందికి పైగా న్యాయవాదుల లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: న్యాయవ్యవస్థ సమగ్రతకు ప్రమాదం వాటిల్లులోందని, రాజకీయ ఒత్తిళ్ల నుంచి దానిని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందని పలువురు న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రాతో సహా 600 మందికి పైగా న్యాయవాదులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్‌కు లేఖ రాశారు. నిరాధార ఆరోపణలు, రాజకీయ ఎజెండాలతో న్యాయవ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజకీయ నాయకుల కేసుల్లో ఇవి స్పష్టంగా కనిపిస్తున్నాయని వెల్లడించారు. న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలను కలిసి కట్టుగా ఎదుర్కోవాలని సూచించారు.

‘న్యాయవ్యవస్థ పనితీరును తప్పుపట్టేందుకు అనేక కథనాలు రూపొందిస్తున్నారు. వీటి వల్ల న్యాయవ్యవస్థపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయే అవకాశం ఉంది. ప్రజలు కోర్టుల పక్షాన నిలబడాలని నమ్ముతున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో న్యాయవాదులు తమ గళాన్ని పెంచాలి. కోర్టులు ప్రజాస్వామ్యానికి మూలస్థంబాలుగా ఉండేలా చూడాలి’ అని పేర్కొన్నారు. ‘రాజకీయ నాయకులు ఎవరైనా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించడం, కోర్టులో వారిని సమర్థించడం వింతగా ఉంది. కోర్టు నిర్ణయం తమ దారికి రాకపోతే, వారు మీడియా ద్వారా కోర్టులను విమర్శిస్తున్నారు’ అని ఆరోపించారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో న్యాయవ్యవస్థను కాపాడుకోవడం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed