ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

by Mahesh |
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు మరో షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కి మరోసారి షాక్ తగిలింది. తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతడిని హాజరుపరచగా.. ఆయన జ్యుడీషియల్ కస్టడీ ఆగస్టు 20 వరకు పొడిగిస్తూ.. రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుండి వచ్చిన తొమ్మిది సమన్లకు ప్రతిస్పందించనందున, కేజ్రీవాల్‌ను 21 మార్చి 2024 న రాత్రి 09:00 గంటలకు అరెస్టు చేశారు. భారతదేశ చరిత్రలో మొదటి సిట్టింగ్ ముఖ్యమంత్రులు అయ్యారు. కాగా ఆయన మధ్యలో ఒకసారి బెయిల్ పై బయటకు వచ్చి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసిన తర్వాత మళ్లీ కస్టడీలోకి వెళ్లారు. దీంతో మార్చి 21 నుంచి ఆయన తీహార్ జైలులో ఉండగా.. జైలు నుంచి ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆయన నడుపుతున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story