- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్.. కోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ
దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును ఢిల్లీ హై కోర్టు రిజర్వ్ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్ చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టి ఇరువర్గాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు రిజర్వ్ చేసింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేయడంతో కోర్టు నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కేజ్రీవాల్‌కు ఊరట దక్కుతుందా లేదా అని ఆప్ శ్రేణుల్లో సందిగ్ధత నెలకొంది. కాగా, ఇదే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఈడీ అరెస్ట్ చేసిన కేసులో కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే, సీబీఐ కేసులో బెయిల్ లభించకపోవడంతో కేజ్రీవాల్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్నారు. సీబీఐ కేసులో బెయిల్ వస్తే కేజ్రీవాల్ జైలు నుండి బయటకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ హై కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.