బిగ్ బ్రేకింగ్: కేంద్ర కేబినెట్‌లోకి జేపీ నడ్డా.. త్వరలోనే బీజేపీ చీఫ్ పోస్ట్‌కు రాజీనామా..!

by Satheesh |   ( Updated:2024-06-09 13:33:06.0  )
బిగ్ బ్రేకింగ్: కేంద్ర కేబినెట్‌లోకి జేపీ నడ్డా.. త్వరలోనే బీజేపీ చీఫ్ పోస్ట్‌కు రాజీనామా..!
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) కూటమి కేంద్రంలో మరి కాసేపట్లో ముచ్చటగా మూడో సారి కొలువుదీరనుంది. సెంట్రల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కూటమికి రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన మోడీ.. వరుసగా మూడో సారి భారత ప్రధానిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం ప్రధాన మంత్రిగా మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మోడీతో పాటు ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన మరో 50 మంది ఎంపీలు కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో, అనుహ్యంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేరు తెరపైకి వచ్చింది. నడ్డా మరోసారి కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఢిల్లీ కేంద్ర వర్గా్ల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న నడ్డాకి మోడీ 3.0 కేబినెట్‌లో మంత్రిగా చోటు దక్కినట్లు టాక్. మోడీతో పాటు నడ్డా కూడా ఇవాళే ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలుస్తోంది.

పార్టీ చీఫ్‌గా నడ్డా పదవీ కాలం త్వరలోనే ముగియనుంది. ఇప్పటికే రెండు సార్లు జాతీయ అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన నడ్డా.. మరోసారి ఆ బాధ్యతలు చేపట్టేందుకు ఆసక్తిగా లేరని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే నడ్డాకు కేబినెట్ పదవి ఇవ్వాలని బీజేపీ నిర్ణయించినట్టు నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కాగా, 2014 నుంచి 2019 వరకు మోడీ మొదటి కేబినెట్‌లో నడ్డా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రిగా పని చేశారు. 2020లో బీజేపీ చీఫ్‌గా నియామకమయ్యారు. ప్రస్తుతం ఆయన అదే పదవిలో కొనసాగుతున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో త్వరలోనే నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Next Story

Most Viewed